పుట్టెడు కరువు ప్రాంతం… అయినా రైతులు లక్షల విలువ చేసే మిల్లెట్లు పండిస్తున్నారు…
పుట్టెడు కరువు ప్రాంతంలోనూ రైతులు అద్భుత విజయం సాధించారు. రైతు కూలీలు వలసలు వెళ్ళిపోయినా, అత్యధిక పంట దిగుబడి తెచ్చుకున్నారు. మహారాష్ట్ర లోని జాత్ తాలుకాలోని ముద్యాల్ ప్రాంతం ఇందుకు వేదిక అయ్యింది. నూతన విధానాలు, ప్రభుత్వ సాయంతో మిల్లెట్ల పంటలో అధిక దిగుబడి సాధించారు. 30 మంది రైతులు ఒక సమూహం గా ఏర్పడి, ఈ విజయం సాధించారు. మొదట్లో కొంత మొత్తంలోనే మిల్లెట్ల పంట వచ్చినా, తర్వాత అర ఎకరంలోనే 30 నుండి 40 క్వింటాళ్ళ పంటను తీస్తున్నారు. అక్కడి వ్యవసాయ అధికారులు కూడా రైతుల కష్టం చూసి ఆనందమ్ వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ముద్గ్యాల్ రీతులను మోడల్గా తీసుకోవాలని చెబుతున్నారు.
కొన్ని రోజులుగా మన దేశంలో మిల్లెట్ల పంట దిగుబడి బాగా తగ్గింది. దీంతో ఐక్య రాజ్య సమితి 2023 ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ అని ప్రకటించింది. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా మన దేశంలో దానికి మద్దత్తు ఇచ్చింది. మిల్లెట్ పంటకు కనీస మద్దత్తు ధర ఇవ్వడం, రైతులకు ప్రోత్సాహం ఇవ్వడం చేయడం జరుగుతోంది. అలాగే ఇంద్ర ఆర్ధిక మంత్రి తన బడ్జెట్ స్పీచ్ లో మిల్లెట్ (శ్రీ అన్న) గురుంచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్ ను మిల్లెట్ హబ్ గా మార్చడానికి “ది మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 9 రాష్ట్రాల్లో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో మహారాష్ట్ర రాష్ట్రం ఒకటి.
ఈ సంస్థను ముద్గ్యాల్ రైతులు బాగా వాడుకున్నారు. అధికారులు చెప్పినట్లు నడుచుకున్నారు. దీంతో కరువు ప్రాంతంలోనూ మిల్లెట్లను బాగా పండిస్తున్నారు. హైబ్రీడ్ విత్తనాలు, యూరియా, బసల్ ఫెర్టిలిసేర్స్, నైట్రోజన్ ఫెర్టిలిసేర్స్, ఇంటిగ్రేటేడ టెక్నాలజీతో విజయం సాధించారు. నిజానికి ముద్గ్యాల్ ప్రాంతం వర్ష ఆధారిత ప్రాంతం. వర్షాలు కురుస్తేనే పంటలు బాగా పండుతాయి. ముద్గ్యాల్ ప్రాంతం అతి తక్కువ వర్షపాతం నమోదు అయ్యే ప్రాంతం. 522 మి.మి వార్షిక వర్షపాతం నమోదు అవుతుంది. దీంతో పంటలు పండించడం సవాలుగా మారింది. అలాగే రైతు కూలీలు కూడా పక్క ప్రాంతాలకు కూలి పనులకు వెళుతుంటారు. దీంతో ఈ సమస్య కూడా అక్కడ బాగా వుంది. కెనాల్ ద్వార మాత్రమే నీటి సౌకర్యం ఉంది. వర్షం బాగా పడితే, ప్రభుత్వం కెనాల్ లోకి నీటిని విడుదల చేస్తుంది. వర్షం తక్కువగా కురుస్తే, అంటే సంగతులు. అంతటి కరువు ప్రాంతం ఇది. అయినా సరే, ఇక్కడి రైతులు మిల్లెట్ పంటనే బాగా వేస్తారు. వారి ఆహరం కూడా ఇదే కావడంతో, ఎంత కష్టమైనా పండిస్తారు. వీరి కష్టాన్ని చూసి ఆహార భద్రతా కమిషన్, NFSM కింద అన్నశ్రీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ముద్గ్యాల్ గ్రామాన్ని ఎంపిక చేసింది. అల్లాగే ఏక గావ్, ఏక వాన్ (ఒక గ్రామం, ఒక వెరైటీ) పథకం కింద రాత్ర ప్రభుత్వం కూడా ఈ గ్రామాన్ని ఎంపిక చేసింది. దీంతో రైతులు బాగా కష్టపడ్డారు. మిల్లెట్ పంటను పండించారు.
“పాని ఫౌండేషన్” ఏర్పాటు చేసుకున్న రైతులు ….
అతి తక్కువ వర్షపాతం ఉండడంతో అక్కడి రైతులు బాధపడుతూ కూర్చోలేదు. 30 మంది రైతులు సమూహంగా మారి, పాని ఫౌండేషన్ అన్న ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. తుకారం పాటిల్ అనే రైతు దీనికి కో-ఆర్దినేటర్ గా వున్నారు. కరువు ప్రాంతాల్లో ఈ సంస్థ పని చేస్తుంది. 2017 లో ఈ సంస్థ ముద్గ్యాల్ లో “ఫార్మర్స్ కప్” అని ఓ పనిని చేసింది. ఇందులో ముద్గ్యాల్ రైతులు అందరూ పాల్గొన్నారు. నీటిని పొడుపు చేయడానికి ఈ పధ్ధతిని వారు వాడారు. 5 రోజుల పాటు ఈ గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఇందులో, నీటి సంరక్షణ, విత్తనాల ఎంపిక, సాంప్రదాయ ఎరువుల తయారిని నేర్పించారు. దీని తర్వాత ముద్గ్యాల్ రైతులు 30 మంది సమూహంగా మారి, సమత ఫార్మర్స్ గ్రూప్ పేరుతొ సమూహంగా మారారు.
25 ఎకరాల్లో మిల్లెట్ పంటను పండిస్తున్నారు. ఈ పద్దతులను వాడిన తర్వాత విజయం సాధించారు. మొదట్లో ఎకరానికి కేవలం 10 నుండి 12 క్వింటాళ్ళ మిల్లెట్లను పండించారు. ఇప్పుడు ఏకంగా అర ఎకరంలోనే 30 నుండి 43 క్వింటాళ్ళ మిల్లెట్ పంటను తీస్తున్నారు. అంటే కాకుండా కొందరు ఆవు పేడ, డ్రిప్ లైన్, పక్షుల ఎరువుతో పాటు, ఈ ఆధునిక పద్దతి ద్వార ముద్గ్యాల్ లో మిల్లెట్ పంటతో పాటు దానిమ్మ తోటలను కూడా పెడుతున్నారు. పురుగు పట్టకుండా వేప ఆధారిత పురుగు మందులను వాడుతున్నాడు. సావంత్ అనే రైతు ఏకంగా 16 ఎకరాల్లో ఈ పద్దతి ద్వార దానిమ్మ పండించి లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ యేడాది ముద్గ్యాల్ రైతులు తాము పండించిన పంటను వివిధ రాష్ట్రాలకు పంపుతున్నారు. దీంతో ఆదాయం బాగా వస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.