హిందూ మతాన్ని స్వీకరించిన మలయాళ చిత్ర దర్శకుడు అలీ అక్బర్‌

కేరళ మలయాళ చిత్ర దర్శకుడు అలీ అక్బర్‌, అతని భార్య లూసియమ్మ గురువారం హిందూ జీవన విధానాన్ని స్వీకరించారు. హిందూ మతంలో చేరిన తర్వాత అలీ అక్బర్‌ తన పేరును రామ సింహన్‌గా మార్చుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… 8 దశాబ్దాల క్రితం ఉన్నియన్‌ సాహిబ్‌, అతని కుటుంబం ఇస్లాంను త్యజించి మలబార్‌లో హిందూ మతాన్ని స్వీకరించారు. ఉన్నియన్‌ సాహిబ్‌ పేరు రామసింహన్‌. ఆ సమయంలో రామసింహన్‌ ఇంటిపై ఒక మతోన్మాద గుంపు దాడి చేసి అతనిని, అతని సోదరుడిని చంపింది. మిగిలిన కుటుంబ సభ్యులను తమ వెంట తీసుకెళ్లారు. ఈ సంఘటన భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి కొన్ని వారాల ముందు జరిగింది. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని అలీ అక్బర్‌కు రామసింహన్‌ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

జణూ బిపిన్‌ రావత్‌ మరణాన్ని అపహాస్యం చేస్తూ కొంతమంది ముస్లింలు నవ్వుతూ ఎమోజీలను పోస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అందుకు నిరసనగా ఆయన ఇస్లాంను విడిచిపెడుతున్నట్టు తన ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ప్రకటించాడు.

అలీ అక్బర్‌ కేరళలో1921 మలబార్‌ హిందువులపై జరిగిన మారణహోమంపై సినిమా ప్రకటించినప్పుడు వార్తల్లో నిలిచాడు. ఈ సినిమా నిర్మాణానికి ప్రజల మద్దతును కోరగా చాలా మంది అతనికి సహాయం చేశారు. ఈ సినిమా సమయంలో అలీ అక్బర్‌ అనేక రకాల బెదిరింపులను ఎదుర్కొ న్నాడు. అలీ అక్బర్‌ మలయాళ టీవీ చర్చలలో కూడా చురుకుగా పాల్గొంటాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *