రాష్ట్రపతి చేతుల మీదుగా ‘‘మై భారత్ నేషనల్ స్కీం’’ అవార్డు అందుకున్న తెలంగాణ విద్యార్థి
తెలంగాణకి చెందిన వంగపల్లి మణిసాయి వర్మ జాతీయ సేవా పథకం అవార్డు పొందారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 2022-23 కి గాను ‘‘మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీం’’ అవార్డును అందుకున్నారు. సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మణిసాయి వర్మ.. ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన, డిజిటల్ ఇండియా, స్వచ్ఛభారత్, క్యాష్ లెస్ ఇండియా లాంటి విభిన్న పథకాల గురించి గ్రామీణులకు విస్తృత అవగాహన కల్పించారు. మొత్తం 504 మొక్కలను నాటి, అవగాహన కల్పించారు. అలాగే వ్యక్తిగతంగా రెండు యూనిట్ల రక్త దానం చేశారు. 40 కి పైగా ఆరోగ్య, టీకా శిబిరాల్లో పాల్గొని సేవలందించారు. ఇందుకు గాను లక్ష రూపాయల నగదు, ప్రశంసా పత్రాన్ని ముర్ము అందజేశారు.