సేంద్రీయ వ్యవసాయంతో జాతీయ అవార్డు… ప్రపంచానికి పరిచయం

యువ రైతు ఆరిక రవీంద్రను (25) సేంద్రీయ వ్యవసాయం ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రకృతి వ్యవసాయం చేసి జైవిక్ ఇండియా అవార్డును దక్కించుకున్నాడు ఆ యువరైతు. పార్వతీపురం సీతంపేట మండలం దుగ్గి గ్రామసీతంపేట మండలం దుగ్గి గ్రామానికి చెందిన ఆరిక రవీంద్ర ప్రకృతి విధానంలో వివిధ పంటలను సాగు చేసినందుకు గాను రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఏపీ తరపున ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు ఐసీసీ ఫర్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ ద్వారా రవీంద్రకు ఢిల్లీలో అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డులో లక్ష రూపాయల నగదు బహుమతి వుంది. ఈ సందర్భంగా సేంద్రీయ వ్యవసాయం ద్వారా కృషి చేస్తున్నందుకు పార్వతీపురం కలెక్టర్, ఇతర అధికారులు ఆయన్ను ఘనంగా సన్మానించారు కూడా.

ఆరిక రవీంద్ర నాలుగు సంవత్సరాలుగా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చిన పంట ఉత్పత్తులను పొరుగు గ్రామాల మార్కెట్ లో అమ్ముతాడు. సేంద్రీయ పద్ధతిలో పండిన పంట ద్వారా ప్రజల ఆరోగ్యం బాగవుతుందని, దీనిపై ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తామని తెలిపాడు.

ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (ICCOA) అందించే జైవిక్ ఇండియా అవార్డు, భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయానికి గణనీయమైన కృషిని గుర్తించే అవార్డుకు ఎంపిక చేస్తుంది. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతు సాధికార సంస్థ జాతీయ స్థాయిలో 54 ఎంట్రీలలో ఆరు జైవిక్ ఇండియా అవార్డులను గెలుచుకోవడం విశేషం.

తన కుటుంబ పరిస్థితులు బాగో లేకపోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా రవీంద్ర బీఏ చదువును మధ్యలోనే ఆపేశాడు. దుగ్గి గ్రామంలో వుండే తన వ్యవసాయ భూమిలో సేంద్రీయ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు విజయ పథంలో నడుస్తున్నాడు. పంటలను పండించే సమయంలో రసాయనాలతో కాకుండా ఆవు పేడతో కూడిన పద్ధతిలో కూరగాయలు, ఆకు కూరలు, దుంపలు పండిస్తున్నాడు. అలాగే సేంద్రీయ పద్ధతిలోనే వరి, మినుములు, పప్పు ధాన్యాలను కూడా పండిస్తున్నారు. పసుపు, అల్లం పంట కూడా వేస్తున్నాడు.జిల్లా సహజ వ్యవసాయం, వ్యవసాయం మరియు ఉద్యానవన శాఖ అధికారులు మరియు RySS మార్గదర్శకత్వంలో రవీంద్ర విజయవంతమైన సేంద్రియ రైతుగా మారాడు.

తమ జిల్లాలో సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు కాస్త అవగాహన వచ్చిందని రవీంద్ర తెలిపాడు. జిల్లాలో 65,955 ఎకరాల్లో 55,068 మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ కూడా బాగా ప్రోత్సహిస్తున్నారన్నారు. అలాగే తాను కూడా సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాడు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఖర్చు కూడా బాగా తగ్గుతుందని, రైతు అప్పుల ఊబిలోంచి బయటపడతాడని తెలిపాడు. అలాగే నేల సామర్థ్యం కూడా పెరుగుతుందన్నాడు. అలాగే రైతు సాధికార సంస్థ కూడా రవీంద్రకి సేంద్రీయం పట్ల వున్న అంకిత భావాన్ని గుర్తించి, సహాయం, సలహాలు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *