వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ”చెంచుల సామూహిక వివాహ మహోత్సవం”

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వనవాసీ కల్యాణాశ్రమం ఆధ్వర్యంలో చెంచు వధూవరులకు 111 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మాధవీ దేవి. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. చెంచు గిరిజన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరవ్వడం తనకు ఎంతో గౌరవంగా వుందని ప్రకటించారు. 111 చెంచు వధూవరులకు వారి సంస్కృతి, సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా వుందని, పుణ్యకార్యానికి ఈశ్వరుడి ఆశీస్సులు తప్పక వుంటాయన్నారు. ఇక నుంచి నూత దంపతులు జీవితాంతం సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.
governer234
వనవాసీ కల్యాణ పరిషత్ 1979 నుంచి హైదరాబాద్ కేంద్రంగా వున్న ప్రధాన కార్యాలయం కేంద్రంగా విద్య, ఆరోగ్యం, సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, వనవాసీ యువత, మహిళా సాధికారత, క్రీడలు.. ఇలా మొదలైన రంగాలలో వనవాసీల సమగ్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని కొనియాడారు. వనవాసీల సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అంశాల్లో అభ్యున్నతికి వనవాసీ కల్యాణ పరిషత్ వెన్నుదన్నుగా వుంటూ నిలబడిందన్నారు.
kalyan
ఈ చెంచు వధూవరుల జంటలకు సామూహిక వివాహాలు జరిపించడం ద్వారా మన ధర్మంలో వున్న పురాతనమైన పవిత్రమైన ఆధ్యాత్మిక వివాహ వ్యవస్థ వారికి మరింత పరిచయం అవుతుందని, వారిని కూడా ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రయత్నం అవుతుందని, తద్వారా వారు కూడా మన సనాతన ధర్మాన్ని చూసి గర్వపడతారని తెలిపారు.
kalyan 23
మన సంస్కృతే అడవుల నుంచి ప్రారంభం అవుతుందని, అడవుల్లో మన ఋషులు తపస్సు చేసి మన జీవన విధానాన్ని రూపొందించారని పేర్కొన్నారు. వనవాసులు అడవి ప్రాంతాల్లో వుంటూ మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తారని, అందుకే వారు ఆరోగ్యవంతులుగా వుంటారన్నారు.వనవాసి, గ్రామవాసి, నగర్‌వాసి -హమ్ సబ్ భారత్‌వాసి అనే నినాదం వాస్తవమని,దేశంలో మన ఐక్యతకు సరైన అడుగులు వేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.
kalyan 2
ఇక.. హ‌ర్యాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ క్రమశిక్షణతో, సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా వనవాసి నిర్వాహకులు సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమని అన్నారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ వర్మ చెంచు నవ దంపతులను వేదమంత్రోచ్ఛారణతో ఆశీర్వదించారు. అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతిఆదిత్య పరాశర స్వామీజీ నవ దంపతులకు వివాహ బంధం గురించి వివరించి వారిని ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *