జామూన్ పండ్లు తెంపుతున్న హిందూ మైనర్ విద్యార్థులపై మౌల్వీ దాడి.. గొంతు నులిమి చంపే ప్రయత్నం
మహారాష్ట్ర బీడ్ జిల్లాలో ఓ మౌల్వీతో పాటు తన సహచరుడు రాక్షసత్వాన్ని చూపించారు. ఓ మైనర్ హిందూ బాలుడిపై తీవ్రంగా, అతి క్రూరంగా దాడి చేశాడు. రెండు రోజుల క్రితం దర్ఘర్ అనే ప్రాంతం సమీపంలో హిందూ విద్యార్థులు జామూన్ పండ్లను తెంపుకుంటున్నారు. అంతే… ఈ పండ్లను తెంపుతున్నారంటూ మౌల్వీ మజీబ్, సమీర్ అత్తర్ కసమ్ మైనర్ హిందూ విద్యార్థులపై తీవ్రంగా దాడికి దిగారు. కేవలం దాడికి దిగడమే కాకుండా మౌల్వీ ముజీబ్ ఓ హిందూ విద్యార్థి గొంతు కోసి, చంపేందుకు కూడా ప్రయత్నించాడు. దీంతో ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా వుండటంతో బీడ్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మౌల్వీ ముజీబ్‌ను అరెస్ట్ చేశారు. సహచరుడు సమీర్ కసమ్ పరీరాలో వున్నాడు.
గాయపడిన విద్యార్థులు 13 సంవత్సరాల వయస్సు కలవారు. వారి పేరుంల తేజస్ నవనాథ్ కటారే, రత్నేశ్వర్ తొంబరే. వీరిద్దరూ దిండ్రూడ్ అనే ప్రాంతానికి చెందిన వారు. మాధ్యమిక పాఠశాలలో చదువుతున్నారు. పాఠశాల పూర్తి చేసుకొని, ఇంటికి తిరిగి వెళ్తుండగా.. మహేబూబ్ సుభానీ దర్గా సమీపంలో వున్న చెట్టు దగ్గరికి వెళ్లి జామూన్ తెంపుతున్నారు.దీనిని గమనించిన మౌల్వీ, అతని సహచరులు కర్రలతో వచ్చి విద్యార్థులను క్రూరంగా కొట్టారు. కొట్టడమే కాకుండా మౌల్వీ తేజస్ తలపై కొట్టి, గొంతు నులిమి చంపేసేందుకు కూడా ప్రయత్నించాడు. మరో హిందూ బాలుడిని తీవ్రంగా కొట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన తేజస్ తలిదండ్రులు దిండ్రూడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మౌల్వీని అరెస్ట్ చేశారు.