అయోధ్య రామ్ లల్లాను దర్శించుకున్న మారిషస్ ప్రధాని

అయోధ్య రామ్ లల్లాను మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రామ్‌గులం, ఆయన భార్య వీణతో పాటు 30 మంది సభ్యుల బృందం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రధాని దంపతులు ప్రత్యేక పూజలు చేసి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. భూటాన్ ప్రధాని తర్వాత అయోధ్యను దర్శించుకున్న రెండో దేశ ప్రధాని ఈయనే.

అయోధ్యకు చేరుకున్న మారిషస్ ప్రధానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాదరంగా స్వాగతం పలికారు. విమానాశ్రయ ప్రాంగణంలో రెడ్ కార్పెట్ పరిచి, మంత్రాలు పఠిస్తూ, సాంప్రదాయ కలశ హారతితో ప్రధానమంత్రికి స్వాగతం పలికారు.

రామ్ లల్లా దర్శనం తర్వాత రామ మందిర సముదాయంలో మారిషస్ ప్రధానికి, వారి ప్రతినిధి బృందానికి ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక లఘు చిత్రాన్ని టాటా కంపెనీ చూపించింది. అక్కడి అధికారులు ఆలయ నిర్మాణం, ఇతర వివరాలను కూడా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *