పెయింట్ డబ్బాలు, గ్రో బ్యాగ్ ద్వారా మిద్దె తోటలు
ఇప్పుడు ఎటు చూసినా మిద్దె తోటలే. మిద్దె తోటల కల్చరన బాగా పెరిగిపోయింది. వ్యవసాయ క్షేత్రాలు లేని వారు ఈ మిద్దె తోటలతో ఫేమసన అవుతున్నారు. ఇంటికి ప్రత్యేక ఆకర్షణతో పాటుగా లాభాలు కూడా గడిస్తున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అనేక కుటుంబాలు టెర్రస్ గార్డెనింగ్ ప్రత్యకంగా దృష్టి పెడుతున్నారు. రసాయనాలు లేని, ఆర్గానిక్ ద్వారా కూరగాయలు, పూలు పండిస్తూ అద్భుతాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ముందు వరుసలో వున్నారు. మిద్దె తోటల పెంపకంపై శిక్షణ తీసుకొని మరీ… ప్రారంభిస్తున్నారు. అయితే… దీనికేదో చాలా వస్తువులు అవసరమని అనుకుంటారు. మన కళ్లముందు కనిపించే వాటితో కూడా ఈ మిద్దె తోటలను సాగు చేసుకోవచ్చు.
పెద్ద పెద్ద కుండీల్లో చేయవచ్చు. అలా కాకుండా.. అతి తక్కువ ఖర్చుతో చిన్న సైజులో వుండే కాటన్ బ్యాగులు, ఇతర కంటైనర్లలో కూడా ఈ మిద్దె తోటను ప్రారంభించవచ్చు.
1. కారు టైర్ల ద్వారా
2. అట్ట పెట్టెల ద్వారా
3. పెయింట్ డబ్బాలలో కూడా
4. వాడేసిన డస్ట్ బిన్ ద్వారా
5. గ్రో బ్యాగుల ద్వారా
6. చాలా రోజులు వాడి, పక్కన పెట్టేసిన షూలలోనూ మొక్కలు పెంచుతున్నారు.
ఒక వంతు మట్టి, ఒక వంతు వర్మీ కంపోస్టు, అందులో కొంచెం వేప పిండి కలిపి మిశ్రమం చేయాలి. ఈ మిశ్రమాన్ని మొక్కలకు వేయాలి. వేప పిండి కలిపితే మొక్కలకు చీడ పురుగులు పట్టకుండా వుంటాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా మనకు చాలా చాలా అందుబాటులో వుండే వస్తువులతో మిద్దె తోటలను చేసుకోవచ్చు.