దేశంలో పెరిగిన పాల ఉత్పత్తి.. దేశవాళీ ఆవుల నుంచే అధికం
దేశంలో పాల ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ యేడాది పాల ఉత్పత్తి 4 శాతం పెరిగింది. ప్రస్తుతం 239.30 మిలియన్ టన్నులకు చేరుకుంది. 2023-2024 లో ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత దేశం వాటా 31 శాతం. దీంతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి పాల ఉత్పత్తిదారుగా భారతం నిల్చుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ప్రపంచమంతా పాల ఉత్పత్తి సగటున 2 శాతం పెరిగితే… భారత్ లో మాత్రం 6 శాతం పెరిగింది. 2023-2024 లో గేదెల నుంచి పాల ఉత్పత్తి 16 శాతం తగ్గినా.. దేశవాళీ ఆవుల నుంచి 44.76 శాతం పెరిగింది. సంకర జాతి ఆవుల నుంచి 8 శాతం పెరిగింది.
గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 230.58 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరిగింది. 2022-2023 లో 3.83 శాతం ఉండగా, 2021-2022 లో 5.77 శాతం వుండగా… ఈ యేడాదిలో మాత్రం పెరిగింది.
ఇక.. మన దేశంలో యూపీ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో వుంది. యూపీలో 16.21శాతం పాలు ఉత్పత్తి కాగా, రాజస్థాన్ లో 14.51 శాతం, మధ్యప్రదేశ్ లో 8.91శాతం, గుజరాత్ లో 7.65 శాతం, మహారాష్ట్రలో 6.71 శాతంగా పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలు దేశంలోని మొత్తం పాల ఉత్పత్తిలో 53.99 శాతం వాటాతో వున్నాయి.