ప్రపంచానికి పరిచయమైన ‘‘భద్రాద్రి మిల్లెట్ బిస్కెట్లు’’.. మహిళలకు ఆర్థిక పుష్టి

భద్రాద్రి మిల్లెట్ బిస్కెట్లు.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా పరిచయమయ్యాయి. భద్రాచలానికి చెందిన నలుగురు గిరిజన మహిళలు కలిసి ఈ బిస్కెట్లను తయారు చేస్తున్నారు.దీంతో మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. అలాగే ఈ బిస్కెట్లను లండన్ కి కూడా ఎక్స్ పోర్ట్ చేస్తున్నారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ఈ మిల్లెట్ బిస్కెట్ల గురించి ప్రస్తావించారు. మ ఉత్పత్తులకు ఇంతటి ఖ్యాతి లభిస్తుందని అస్సలు ఊహించలేదని… ప్రధాని అభినందనలు ఎనలేని ప్రోత్సాహాన్ని ఇచ్చాయని ఆ బృంద సభ్యులైన ఊకె వెంకటలక్ష్మి, తాటి లలిత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గత ఆరు సంవత్సరాల నుంచి ఈ మిల్లెట్ బిస్కెట్లను తయారు చేస్తున్నారు. రుచితో పాటు ఆరోగ్యం కూడా తోడవడంతో వీటికి డిమాండ్ పెరిగింది. అయితే.. వీరు మొదట రాగులు, జొన్నలతో ఈ బిస్కెట్లను తయారు చేశారు.కొంత నష్టం కూడా వచ్చిందని వారు చెప్పారు. ఇప్పుడు మాత్రం జొన్నలు, రాగులు, సామలు, కొర్రలు, జొన్న పిండి, బెల్లం,నెయ్యితో ఈ బిస్కెట్లను తయారు చేస్తున్నారు.

అయితే.. ఈ బిస్కెట్ల కోసం అవసరమయ్యే ముడి పదార్థాలను ఏపీలోని అల్లూరి జిల్లా చింతూరు మండలం తులసిపాకలోని గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అలాగే అధికారులు, ఐటీడీఏ కూడా తమకు సహకరిస్తోందని మహిళలు పేర్కొన్నారు. మొదట 15 వేల రూపాయల వరకు తమకు నష్టం వచ్చిందని, కానీ.. అధికారుల ప్రోత్సాహం, సహకారంతో రోజుకు మూడు కేజీల బిస్కెట్లను తయారు చేసేవారిమని తెలిపారు.

భద్రాచలం రామాలయం, ఐటీడీఏ గిరిజన మ్యూజియం, కొత్తగూడెం, ఖమ్మం కలెక్టరేట్లతో పాటు హైదరాబాద్‌లోని శిల్పారామం తదితర చోట్ల బిస్కెట్లు విక్రయిస్తున్నారు. భద్రాచలంలో స్థానికంగా రెండు కౌంటర్లను స్వయంగా, మరికొన్నింటిని ఇతరుల సహకారంతో నిర్వహిస్తున్నారు.

శ్రీరామ జాయింట్ లయబులిటీ గ్రూపు ఆధ్వర్యంలో ఈ బిస్కెట్లను మహిళలు తయారు చేస్తున్నారు. దీని ద్వారా తాము ఆర్థిక సమృద్ధిని సాధిస్తున్నామని, తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక కిలోకి 8 డబ్బాలు తయారు చేస్తున్నారు. ఒక్కో డబ్బాలో 20 బిస్కెట్లు వుంటాయి. ఈ డబ్బాను 150 రూపాయలకు అమ్ముతున్నారు.ఇలా రోజుకి 40 డబ్బాల బిస్కెట్లను తయారు చేస్తున్నారు.

మొదట శానిటరీ నేప్‌కిన్స్‌తో…

అయితే ఈ మిల్లెట్ బిస్కెట్లను తయారు చేయడానికి ముందు ఈ మహిళలు గిరి శానిటరీ నేప్‌కిన్స్ తయారు చేసేవారు. ఇవి పాత మోడల్ లో వున్నాయని ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. దీంతో 2020 లో ఐటీడీఏ అధికారుల సహకారంతో ఓ కొత్త మిషిన్ ను కొనుగోలు చేశారు. యూనిట్ కాస్ట్ 13.45 లక్షలుండగా.. అందులో 8 లక్షలు ఐటీడీఏ సబ్సిడీ ఇచ్చింది. బ్యాంకు రుణం కింద 4.35 లక్షలు మంజూరు అయ్యాయి. మహిళల వాటా కింద లక్ష రూపాయలు చెల్లించారు.

అయితే కరోనా రావడంతో లాక్ డౌన్ కారణంగా నేప్ కిన్స్ తయారీ చేయలేకపోయారు. అయితే అధికారుల సహకారంతోనే మాస్కుల తయారీ చేశారు. నెల రోజుల తర్వాత మళ్లీ నేప్ కిన్స్ తయారీని ప్రారంభించారు. నెల రోజుల్లో 40 వేల నేప్ కిన్స్ తయారు చేశారు.రవాత మా అందరికీ ఖాళీ సమయం దొరకడంతో మిల్లెట్‌ బిస్కట్లను తయారు చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని అప్పటి ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్‌దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి మాకు హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించారు. నాటి నుంచి మా మిల్లెట్‌ బిస్కెట్ల తయారీ కొనసాగుతూనే ఉంది.

మరోవైపు మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావన తేవడంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు.తాము తయారు చేసే బిస్కెట్ల తయారీ ప్రపంచానికి తెలిసొచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *