నిదాఖాన్ కి ఆశ్రయం కల్పించిన ఎంఐఎం నేత అరెస్ట్

నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తప్పించుకోవడానికి సహాయపడిన ఎంఐఎం కౌన్సిల్ అబ్దుల్ మతీన్ పటేల్ అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితురాలు నిదాఖాన్ 25 రోజులపాటు కనిపిచంకుండా పోయారు. ఇందులో అబ్దుల్ మతీన్ దే కీలక పాత్ర అని, ఆయనే ఆశ్రయం కల్పించారని ఆరోపణలు వున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ కి అబ్దుల్ మతీన్ కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. ఓ నేరస్థురాలికి సహకరించినందుకు ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అలాగే ఆమెకు ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలు రావడంతో వాటిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విచారణాధికారుల ప్రకారం, నాసిక్‌లోని టీసీఎస్‌కు అనుబంధంగా ఉన్న బీపీఓ యూనిట్‌కు సంబంధించిన మతమార్పిడి మరియు లైంగిక వేధింపుల రాకెట్‌పై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా అబ్దుల్ మతీన్ పటేల్‌ను నాసిక్ క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది.
నాసిక్ టీసీఎస్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత, నిదాఖాన్ పై ఆరోపణలు వచ్చిన తర్వాత దాదాపు 25 రోజుల పాటు తప్పించుకు తిరిగారు నిదాఖాన్. చివరికి పోలీసులు ఛత్రపతి శంభాజీ నగర్‌లో అరెస్టు చేసిన ఓ రోజు తర్వాత అబ్దుల్ మతీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఖాన్ బంధువులతో కలిసి ఉంటున్నట్లు సమాచారం ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఆమెను గుర్తించారు. తదుపరి విచారణ కోసం నాసిక్‌కు తీసుకురావడానికి ముందు, బదిలీ వారెంట్‌పై ఆమెను స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *