త్వరలోనే ”మేడిన్ ఇండియా చిప్” విడుదల : అశ్వనీ వైష్ణవ్
తొలి మేడ్-ఇన్-ఇండియా చిప్ త్వరలో విడుదల కానుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్‌లోని సనంద్‌లో CG సెమీకి సంబంధించిన OSAT లేదా అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభోత్సవం సందర్భంగా వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో, రెనెసాస్ – స్టార్స్ మైక్రోఎలక్ట్రానిక్స్ సహకారంతో, CG సెమీ గుజరాత్‌లోని సనంద్‌లో రెండు అత్యాధునిక సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ఐదు సంవత్సరాలలో దాదాపు రూ.7,600 కోట్లను పెట్టుబడి పెడుతోంది. అమెరికా సెమీకండక్టర్ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ స్థానిక విభాగం సనంద్‌లో ఏర్పాటు చేసిన సెమీకండక్టర్ సౌకర్యంలో కూడా గణనీయమైన పురోగతి ఉందని మంత్రి తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి చిప్‌ను దేశానికి అంకితం చేస్తారని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సెమీకండక్టర్ చిప్‌ల డిజైన్, తయారు చేయడమనేది.. ఎన్నో ఏళ్ల నాటి కల అని.. అది ఇప్పుడు నేరవేరబోతుందని తెలిపారు. ఈ డ్రీమ్ ను ప్రధాని మోదీ నేరవేర్చబోతున్నారని.. ఆయన విజన్ విద్యా రంగాన్ని బలోపేతం చేయడమేనని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. సెమీ కండక్టర్ల విషయంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం చర్యల్ని వేగవంతం చేస్తోంది. ఇటీవలే దేశం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోకి 13,162 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం 234 విశ్వ విద్యాలయాల్లోని విద్యార్థులకు తాజా సెమీ కండక్టర్ డిజైన్ సాధనాలను అందిస్తున్నారు.