ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు 360 కిలోమీటర్లు పూర్తి

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్ లోని జాతీయ హై స్పీడ్ రైలు ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో ప్రధాన భాగమైన NH-48పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని కూడా కేంద్రమంత్రి సందర్శించారు. దీనితో పాటు, వైష్ణవ్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టును పరిశీలించి, బుల్లెట్ రైలు ప్రాజెక్టులో 360 కి.మీ పూర్తయిందని, దీనిలో మహారాష్ట్ర విభాగం గణనీయమైన పురోగతి సాధించిందని ప్రకటించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న కార్మికులు జాతి నిర్మాణానికి చేస్తున్న కృషికి ధన్యవాదాలు ప్రకటించారు.ప్రభుత్వం, మంత్రులు తమకు అంత గౌరవం ఇస్తున్నప్పుడు, తాము కూడా దేశాభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులలో చాలా చోట్ల ప్రత్యేకమైన నిర్మాణం జరుగుతోందని వైష్ణవ్ అన్నారు. ఈ వంతెన బరువు 1100 టన్నుల కంటే ఎక్కువ. దాని ప్రత్యేక భాగాలు భారతదేశంలో తయారు చేయబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *