పట్టాదారు పాసుపుస్తకం లేకున్నా రుణ మాఫీ : మంత్రి తుమ్మల
రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పట్టాదారు పాసుపుస్తకం లేకున్నా ఈ రుణమాఫీ వర్తిస్తుందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. అలాంటి రైతుల ఇళ్లకు అధికారులే వెళ్లి వివరాలు సేకరించి, మాఫీని వర్తింపజేస్తామని శాసనసభలో ప్రకటించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు బ్యాంకుల్లో పంటరుణాలు తీసుకున్న రైతుల వివరాలు తీసుకున్నామని, వాటి ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నామన్నారు. అంతకు ముందు మాఫీ అయినా వర్తింపజేస్తామని, అయితే.. తెల్ల రేషన్ కార్డు నిబంధన అనేది కేవలం కుటుంబ నిర్ధారణ కోసమేనని పునరుద్ఘాటించారు. రాబోయే రోజుల్లో పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వమే ప్రీమియం చల్లించేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని వెల్లడిరచారు.