MMRI ఆధ్వర్యంలో ఉస్మానియాలో ‘‘నక్సల్స్ నరమేధం -మేధోమథనం’’ సదస్సు

‘‘నక్సల్స్ నరమేధం – మేధోమథనం’’ అన్న పేరుతో MMRI (MARTYRS MEMORIAL RESEARCH INSTITUTE) ఓ సదస్సు నిర్వహిస్తోంది. ఈ నెల 31 వ తేదీన (గురువారం) ఉస్మానియా యూనివర్సిటీలోని PGRRCDE ఆడిటోరియంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకి వక్తలుగా

పానుగంటి చంద్రమౌళి (రిటైర్డ్ ఏఎస్పీ)

బాలకృష్ణ – జాతీయ సహ సంఘటనా కార్యదర్శి, ఏబీవీపీ

సురేందర్ రావు – సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

పి. మురళీ మనోహర్ – జాతీయ ఉపాధ్యక్షులు – విద్యాభారతి

సురేష్ కొచ్చాటిల్ – జర్నలిస్టు

డా. మాసాడి బాపురావు – సామాజిక కార్యకర్త

సాయికృష్ణ – సీఈవో, నేషనలిస్ట్ హబ్

1967 నుంచి నేటి వరకు నక్సలైట్లు సృష్టించిన నరమేధం అంతా యింతా కాదు. ఆపరేషన్ కగార్ ఓ పక్క, శాంతి చర్చలే ఎత్తుగడగా మరో పక్క, సాయుధ నక్సల్స్ కన్నా ప్రమాదకారులైన అర్బన్ నక్సల్స్ మరోపక్క, సమాజంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అందరికీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం వుంది. కాబట్టి ఆలోచనల్లో స్పష్టత కోసం జరుగుతున్న మేధోమథనమిది అని MMRI అభిప్రాయపడుతోంది. విద్యార్థులు, యువకులు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, జర్నలిస్టులు, సమాజమంతా ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

బెంగాల్ లోని నక్సల్ బరి గ్రామం నుంచి భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసమంటూ ప్రారంభమైన ఉద్యమం క్రమంగా హింసాత్మకంగా మారింది.970వ దశకం నుండి 2-3 దశాబ్దాల పాటు తెలంగాణ పల్లెల్లో జరిగిన నరమేధం, అరాచకాలు, అల్లర్లు అంతా ఇంతా కాదు. 2004 లోపీపుల్స్ వార్ గ్రూప్ (PWG)గా పిలువబడి Communist Party of India (Marxist-Leninist) CPI(ML) మరియు MCCI(Marxist Communist Center of India) వీరి కలయిక తర్వాత గెరిల్లా పోరాటాలు, విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, నూతన ఆయుధాల సేకరణ,టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

మేధావులు, ప్రజా సంఘాలు, NGOల పేర్లమీద జనసామాన్యంలో తిష్ఠ వేయడం మనమందరం చూస్తూనే ఉన్నాం. సాహిత్యం, కళారూపాల్లోనే కాకుండా సరికొత్తగా
సైబర్ ప్రపంచంలో కూడా అడుగుపెట్టి యువకులను, యూనివర్సిటీలను అడ్డాగా చేసుకుని social media లో కల్పిత ప్రచారాలు మొదలు పెట్టారు.

మావోయిస్టులు. ప్రతీ రంగంలో చొచ్చుకుపోయిన నక్సల్స్, బూటకపు ఎన్కౌంటర్ లు, బూటకపు ప్రజాస్వామ్యం, బూటకపు స్వాతంత్ర్యం అంటూ ప్రతీ దాన్ని‘బూటకం’అని అనీ ప్రజల మెదళ్ళలోకి ఒక బూటకపు పదజాలాన్ని ప్రవేశపెట్టారు.నక్సల్స్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆదివాసీల పోరాటమంటూ, పర్యావరణాన్ని కాపాడటానికంటూ, ఖనిజ సంపదను కాపాడటంకోసం చేస్తున్న
పోరాటంగా చిత్రీకరిస్తూ కల్పిత కథనాలు (fake narratives) ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో MMRI సారథ్యంలో జరగబోయే సదస్సుకి ప్రాధాన్యత ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *