MMRI ఆధ్వర్యంలో ‘‘ నక్సల్స్ నరమేధం – మేధోమథనం సదస్సు పార్ట్-1

నక్సలిజం అంటే ఓ అరాచకమని, ఈ అరాచకం ద్వారా మనుషుల్ని చంపడం కొందరికి నేర్పించారని రిటైర్డ్ ఏసీపీ చంద్రమౌళి అన్నారు.ఎవర్ని ఎందుకు చంపారో కూడా తెలియని పరిస్థితిలో వున్నారన్నారు.MMRI సంస్థ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీలోని PGRRCDE ఆడిటోరియంలో నక్సల్స్ నరమేధం – మేధోమథనంపై గురువారం జరిగిన సదస్సుకి రిటైర్డ్ ఏఎస్పీ పానుగంటి చంద్రమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెల్లో కొంత ఉద్రిక్తపరులుగా వున్న వారిని తీసుకెళ్లి, నక్సలిజం సిద్ధాంతాన్ని రుద్ది, వారిని అలా తయారుచేసేవారన్నారు. అసలు ఏ వర్గ శత్రువుల కింద నక్సలైట్లు ఆరెస్సెస్ కార్యకర్తలను చంపారని నిలదీశారు. ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ఆరెస్సెస్ కార్యకర్త కూడా నక్సలిజం, మార్క్సిజం డౌన్ డౌన్ అన్నవాళ్లను తాను చూడలేదన్నారు.
NAXALS1
నక్సలిజానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు, నడుచుకునేవారు, సైద్ధాంతికంగా విభేదించేవారెవ్వరూ వుండకూడదన్నదే నక్సలైట్ల ఆలోచన అని అన్నారు. నక్సలైట్లకు ఓ సిద్ధాంతమంటూ ఏమీ లేదని, తామే బలవంతులం కావాలన్నదే నక్సలైట్ల సిద్ధాంతమన్నారు. కానీ పైన ఈశ్వరుడంటూ ఒకడు వుంటాడని, వారికి అడ్డుకట్ట వేశారన్నారు. ప్రస్తుతం నక్సలిజం రూపు, పేరు లేకుండా పోయిందన్నారు. ఈ అడ్డుకట్టను ఇలాగే నిలబెట్టాలని లేదంటే ఏదో ఒక రూపంలో నక్సలైట్లు వస్తూనే వుంటారన్నారు. వున్న వారిని చూసి ఓర్వలేకపోవడం అన్న దాంట్లో నుంచే అసంతృప్తవాదం పుట్టుకొస్తుందని మూలభావనను ఆయన ఆవిష్కరించారు.
NAXALS123
ఇక.. సామాజిక కార్యకర్త డాక్టర్ మాసాడి బాపురావు మావోయిస్టు ప్రయాణం గురించి మాట్లాడుతూ..భారత్ లో 1920 లో ఎం.ఎన్. రాయ్ కమ్యూనిస్టు పార్టీని ప్రారంభించారని, కానీ.. అది భారత్ లో స్థాపించబడలేదని, రష్యాలో ప్రారంభించారన్నారు. సహజంగా అందరూ అనుకుంటున్నట్లు బోల్షివిక్ విప్లవం లెనిన్ చేతుల మీదుగా రాలేదన్నారు. ఈ సమయంలో లెనిన్ జర్మనీలో వున్నాడని కానీ.. అందరూ లెనిన్ తెచ్చాడని ఊదరగొడుతుంటారన్నారు. రష్యాలో విప్లవం సాధ్యమైందని, అందుకే భారత్ లో కూడా విప్లవం రాబోతోందని కలలు కన్నారని ఎద్దేవా చేశారు. కానీ భారత్ లో 100 సంవత్సరాల తర్వాత కూడా విప్లవం రాలేదన్నారు. తన పిల్లల్ని తానే తినే జీవిలాగా.. కమ్యూనిస్టులు కోటి ఇరవై లక్షల మందిని ఒక్క రష్యాలోనే చంపేశారన్నారు.
ఈ రక్తపాతం ప్రపంచమంతా సాగిందన్నారు. రక్తపాతమే దాని స్వరూపమని, రక్తదాహమే దాని స్వభావమని పేర్కొన్నారు. మొదట మనుషుల్ని చంపిన తర్వాతే, సిద్ధాంతం చెప్తారన్నారు.తుపాకీ గొట్టం ద్వారానే మార్పువస్తుందని పదే పదే చెబుతుంటారని, ఇదే దీనికి తార్కాణమని అన్నారు. నిజాంకి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పిన కమ్యూనిస్టులు ప్రజలను నానా ఇబ్బందులు పెట్టారన్నారు.వీరి గురించి సహజంగా ఓ నానుడి ప్రచారంలో వుందని ‘‘దిన్ కా రాజా.. రాత్ కా రాజా’’ అని అన్నారు. దినంలో రజాకార్లతోని ఇబ్బందులు పడితే.. పల్లె ప్రజలు రాత్రి సమయాల్లో కమ్యూనిస్టులు ప్రజల్ని ఇబ్బందిపెట్టేవారని వివరించారు.
కాబట్టి కమ్యూనిస్టుల ప్రాథమిక సూత్రం తన ప్రజల్ని తాము చంపడమే అన్న సిద్ధాంతమని బాపూరావు విమర్శించారు.నిజాం లొంగిపోయినా.. కమ్యూనిస్టులు తమ పోరాటాన్ని ఆపలేదని, భారత్ పై సాయుధ పోరాటం చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. 1951 సమయంలో చర్చలు అని ప్రభుత్వం చెప్పినా.. రాలేదన్నారు. కానీ.. స్టాలిన్ చెప్పాడని కమ్యూనిస్టులు ఆయుధాలు విడిచిపెట్టేశారన్నారు. పోలీసు యాక్షన్ లో కమ్యూనిస్టులు నాలుగు వేల మంది దళ సభ్యులు చనిపోయారని, వీరికి సంబంధించిన పూర్తి రికార్డులు కమ్యూనిస్టుల వద్ద వుంటాయని, కానీ సాధారణ ప్రజలు 8 వేల మంది చనిపోయినా.. వారి రికార్డులే లేవన్నారు. సాధారణ ప్రజల రికార్డులు, మరణాల గురించి కమ్యూనిస్టులు ఊసెత్తరని మండిపడ్డారు.కానీ.. చివర్లో పుచ్చలపల్లి సుందరయ్య మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజల ప్రజాస్వామిక ప్రయత్నాలు అర్థం చేసుకోలేదని తన ఆత్మకథలో రాసుకున్నారన్నారు. దాదాపు 12 వేల మంది చనిపోయిన తర్వాత మెళ్లిగా ఇలాంటి కబుర్లు, సిద్ధాంతాన్ని చెప్పారన్నారు.
అయితే.. తమ సిద్ధాంతంతో ఇప్పుడే విప్లవం రాదని, రాబోయే రోజుల్లో వస్తుందని ప్రజల్ని నమ్మబలుకుతారని ఎద్దేవా చేస్తారు. ఆ తర్వాత సీపీఎం నుంచి విడివడిన కొందరు నక్సల్బరీ గ్రామంలో నక్సలైట్ పార్టీని స్థాపించారన్నారు. వసంతమేఘం గర్జిస్తుంది, విప్లవం రాబోతోందంటూ పిలుపునిచ్చారని, ఆ తర్వాత కూడా పార్టీ మూడు ముక్కలైందన్నారు. ఆ తర్వాత చైనా చైర్మనే తమ చైర్మన్ అని చెప్పారని, భారతీయులను నియమించలేదన్నారు. ఎక్కడి ప్రజల శ్రేయస్సు కోసం మావోయిస్టు పార్టీ స్థాపించారో తెలుసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమను గుడ్డిగా ఫాలో అవ్వదని చైనా నేతలే చెప్పినా.. ఇక్కడి కమ్యూనిస్టులు వినలేదని, విపరీతమైన స్వామి భక్తిని ప్రదర్శించారని ఎద్దేవా చేశారు.ఊహాజనితంగా ప్రారంభమైన ఓ ఉద్యమం… వివిధ ప్రాంతాల గుండా తెలంగాణలోకి వచ్చిందన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలోని జాతీయవాదులను నక్సలిజం చాలా ఇబ్బందులు పెట్టిందని, నక్సలైట్లు నరమేధమే సృష్టించారన్నారు. 1972 నుంచి ఇప్పటి వరకు చాలా మందిని చంపేశారన్నారు. ఆర్ఏసీ పేరుతో అనేక మంది అమాయకులను ప్రభావితం చేశారని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *