ప్రధాని మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం ప్రదానం

తొలిసారి నైజీరియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశంలో అరుదైన గౌరవం దక్కింది. నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం అయిన ‘గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది నైగర్‌’ అవార్డుతో ఆ దేశం మోదీని సత్కరించింది. ఈ అవార్డును ఆదివారం మోదీకి అందజేసింది. నైజీరియన్లు కాకుండా.. 1969లో క్వీన్‌ ఎలిజబెత్‌ తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండో విదేశీ వ్యక్తి మోదీనే కావడం విశేషం. ఈ అవార్డును తనకు అందజేసిన నైజీరియా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును 140 కోట్ల భారతదేశ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విదేశాల్లో మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం. ఆ దేశాధ్యక్షుడు బోలా అహ్మద్‌ తినూబూ ఆహ్వానం మేరకు ఆదివారం నైజీరియా చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *