రైతులకు శుభ వార్త… పీఎం కిసాన్ నిధుల విడుదల
రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ప్రారంభించిన ‘‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. వారణాసిలో నిర్వహించిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో విడుదల చేశారు. దాదాపు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2 వేల రూపాయల చొప్పున 20 వేల కోట్లు జమ కానున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ… పీఎం కిసాన్ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలకు ఇప్పటికే 3 లక్షల కోట్లకు పైగా నగదు బదిలీ చేసినట్లు తెలిపారు. నేడు ఒకే క్లిక్‌తో 9.26 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు 20 వేల కోట్లను బదిలీ చేశామని తెలిపారు.