భారత్ కి విశ్వబంధు అన్న గుర్తింపు వుంది : మోదీ
భారత్ కి విశ్వబంధు అన్న గుర్తింపు వుందని, దానిని మరింత బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్ కేవలం యువ దేశమే కాదని, నిపుణులైన యువకుల దేశమని అభివర్ణించారు. భువనేశ్వర్ లో జరుగుతున్న 18 వ ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. భారత్ ప్రజాస్వామ్యానికి కేవలం తల్లి లాంటిది మాత్రమే కాదని, అది మన జీవితాల్లో భాగమన్నారు. విదేశాల్లో జీవించే వారు భారత్ కి రాయబారులు అన్న కోణంలో తాను చూస్తానన్నారు. భారత్ నుంచి యువత పూర్తి నైపుణ్యాలతో విదేశాలకు వెళ్లేలా చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, జీ 20 సందర్భంగా దేశ వ్యాప్తంగా సదస్సుల నిర్వహించి భారత్ వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలిపామన్నారు. మన వారసత్వ, విభిన్న సంస్కృతులను ప్రపంచం గమనిస్తోందన్నారు. మానవుడి భవిష్యత్తు యుద్ధంలో లేదని, బుద్ధుడిలో వుందన్నారు. ఒడిశా నుంచి వెళ్లి వ్యాపారులు సుమత్రా, బాలి, జావా వంటి ప్రాంతాల్లో వ్యాపారులు చేసేవారన్నారు.