ఆ త్యాగాలవల్లనే భారత్‌ నిలబడిరది…

భారత స్వాతంత్య్రం కోసం పోరాడి.. ప్రాణాలర్పించిన వ్యక్తుల స్మారకార్థం నిర్మించిన నివాళి గోడను రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ ప.పూ.సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ కన్యాకుమారిలో ప్రారంభించారు. ఈ నివాళి గోడపై భారతమాత కోసం ప్రాణాలు అర్పించిన 1040 మంది ప్రముఖ జాతీయ నాయకుల పేర్లున్నాయి. ఈ నివాళి గోడను ‘‘చక్ర విజన్‌ ఇండియా ఫౌండేషన్‌’’ చైర్మన్‌ చక్ర రాజశేఖర్‌ రూపొందించారు. ఈ సందర్భంగా ప.పూ సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ మాట్లాడుతూ.. భారతదేశం చాలా ప్రాచీనమైందని, చైనా కంటే ప్రాచీనులమని తెలిపారు. ఈలోగా గ్రీస్‌, ఈజిప్ట్‌ వంటి అనేక దేశాలు ఉద్భవించి, అదృశ్యమయ్యా యని అన్నారు. కానీ.. భారత్‌ మాత్రం ఇప్పటికీ ఉనికిలో ఉందన్నారు. సుదీర్ఘకాలం ఇలా నిలబడడానికి  ఎందరో అనేక త్యాగాలు చేశారని గుర్తు చేశారు.

విదేశీయులు అనేక దండయాత్రలను తట్టుకొని భారత్‌ స్థిరంగా నిలబడిరదన్నారు. ఓ ఆక్రమణ దారుడు భారత్‌ గడ్డపై అడుగు పెట్టగానే.. ఇక్కడి ప్రజల నుంచి ప్రతిఘటన ప్రారంభమవుతుందని, ఆక్రమణదారులు యుద్ధాలు గెలిచి వుండవచ్చని, కానీ.. ఈ పోరాటాలు సుదీర్ఘంగా జరిగాయన్నారు. భారత్‌ ఎన్నటికీ బానిసత్వాన్ని అంగీకరించలేదని, చివరికి ఆక్రమణదారులు యుద్ధంలో ఓడిపోయి లేదా తరిమివేయబడ్డారని డా.మోహన్‌భాగవత్‌ వివరించారు.

75వ స్వాతంత్ర దినోత్సవాలను జరుపు కుంటున్న సమయంలో అఖండ భారత్‌కి సంబంధించిన పాత సరిహద్దులలోని ప్రతి జిల్లాలో మాతృభూమి కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులను తలుచుకోవాలని అన్నారు. వారి పోరాటాలు, త్యాగాలే మనకు స్ఫూర్తి అని, ఈ త్యాగాలు మనల్ని మనం మెరుగుపరుచు కోవడానికి కృషి చేయాలని గుర్తు చేస్తాయని, భారత్‌ విశ్వగురువుగా ఎదిగేందుకు సహకరిస్తాయని మోహన్‌ భాగవత్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *