కలెక్టర్‌గా, డాక్టర్‌గా… ఇలా ఏదైనా సరే, ఎక్కడైనా సరే పని ఉత్తమంగా చేయాలి
మనం ఎక్కడున్నా మన మన స్థానాల్లో మన కర్తవ్యాన్ని ఉత్తమ పద్ధతిలో చేయడం ద్వారా కూడా సిద్ధి పొందవచ్చు. కాబట్టి మనం అందరమూ చేయవలసింది మొదట సేవే. మీరు ఎక్కడ వున్నా, ప్రభుత్వ అధికారిగా వున్నా, కలెక్టర్‌గా, డాక్టర్‌గా, ఇంజనీరుగా, ఉపాధ్యాయునిగా… ఇలా ఏదైనా సరే, ఎక్కడైనా సరే పని ఉత్తమంగా చేయాలి.పని ప్రామాణికంగా చేయాలి. నిస్వార్థబుద్ధితో చేయాలి. ఉపకారం కొరకు గానీ, జీవనభృతిగా కాకుండా సేవ రూపంగా చేయాలి. దేశంలో ఎక్కడెక్కడ స్వార్థం, ఈర్ష్య, లోభత్వం మొదలైన సంకటాలు కనిపిస్తాయో అక్కడి ప్రజలను ఆ సంకటాల నుంచి విముక్తం చేయడానికి ఏం చేయాలో ఆలోచించి పని ప్రారంభించండి.
-ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భగవత్