స్వయం ఉపాధి, స్వావలంబన సాధించడానికే మూలం సంతల ఏర్పాటు: గ్రామ భారతి ప్రకటన
గ్రామ భారతి 28 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తార్నాకలోని మర్రి కృష్ణ హాలులో మూలం సంత పేరుతో కార్యక్రమం జరిగింది. గ్రామ భారతి మరియు CSR Memorial Foundation సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తుల విక్రయం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ కార్యక్రమం జరిగింది. నిత్య జీవితంలో అవసరమయ్యే అన్ని వస్తువులను ఆయుర్వే ఔషధాలు, విష రహిత ఎరువులు ,క్రిమి నియంత్రక కషాయాల ద్వారా ఏర్పాటు చేసిన వాటిని అమ్మే విధంగా, అలాగే స్వయంగా గ్రామీణులే స్వయంగా అమ్ముకోవడం చేయవచ్చని గ్రామ భారతి మార్గదర్శకులు ఆకుతోట రామారావు తెలిపారు. ఇలాంటి వ్యవస్థ ద్వారా దళారులను దూరం చయడం, స్వయం ఉపాధి, స్వావలంబన సాధించడానికి, పర్యావరణం, ప్రకృతిని కాపాడుకోవడమే ఈ సంతల ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.
ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల వారు విక్ర్రయించుకనేందుకు, దళారులను దూరం చేసేందుకు ఇలాంటి సంత ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ సంతలో చేనేత వస్త్రాలు, దేశీ విత్తనాలు, మిల్లెట్ ఉత్పత్తులు వున్నాయని, ఇవన్నీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయన్నారు.
ఈ సంతలో ప్రత్యేక ఆకర్షణలుగా ఆరోగ్యకర మిల్లెట్ ఆహారం, నోరూరించే మిల్లెట్ ఐస్‌క్రీం, గోయంతో చేసిన పేంట్, పుట్టి, యోగా మాట్ ఇలాంటి ఎన్నో వస్తువులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఇంటి పంటలు, దేశీ విత్తనాఉల, స్వచ్ఛమైన ఎద్దు గానుగ నూనెలు కూడా సంతలో వుంచారు.