రాజ్యాంగాన్ని అవమానించిన మౌల్వీ…

రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ, న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మౌల్వీ మౌలానా అబూ తాలిబ్ రెహ్మానీపై జాతీయ వాదులు మండిపడుతున్నారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ మీది… వీధులు మావి’’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమేనని, వ్యవస్థలను కూడా బెదిరించడమే అవుతుందన్నారు.
పార్లమెంట్ మీది… వీధులు మావి అని చెప్పడం అంటే వేర్పాటువాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, చట్టాలను పూర్తిగా అవమానించడమేనని అంటున్నారు.భారత దేశ లౌకిక ప్రజాస్వామ్యంపై దాడేఅని అభివర్ణించారు. ప్రజల మధ్య ఉద్రిక్తతలను రేకెత్తించేదిగా వుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *