వనపర్తిలో గ్రామ భారతి ఆధ్వర్యంలో ‘‘మూలంసంత’’
గ్రామ భారతి తెలంగాణ, అంజనీ బాలకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో వనపర్తిలో ‘‘మూలంసంత’’ జరిగింది. ఈ సందర్భంగా సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలు, సరుకులతో పాటు చేనేత, హస్తకళల ప్రొడక్ట్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు పండించిన విధానాన్ని రైతులు ఈ సందర్భంగా వివరించారు. మామూలుగా అయితే కేవలం హైదరాబాద్ నగరంలోనే మూలంసంత జరిగేదని,కానీ… సేంద్రీయ విధానాన్ని, సేంద్రీయ పంటలను, హస్తకళలను అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఇతర జిల్లాలకు కూడా దీన్ని విస్తరిస్తున్నామని గ్రామ భారతి ప్రకటించింది. ఈ మూలంసంతను బాలకృష్ణయ్య కుమార్తె ఉదయశ్రీ, గ్రామ భారతి తెలంగాణ అధ్యక్షులు సూర్యకళ కలిసి ప్రారంభించారు. ఇకపై ప్రతి నెలలో వనపర్తిలో మూలంసంత నిర్వహిస్తామని ప్రకటించారు.