ముల్లంగి
ముల్లంగి గురించి విననివారు ఉండరు. దొరకని ప్రదేశమూ ఉండదు. ముల్లంగి మన దొడ్లో కాసే ఒక అమూల్యమైన ఔషధం. ‘‘ముల్లంగే కదా పీకి పారెయ్యండి. అది ఎందుకూ పనికి రాదు’’ అని ముల్లంగిని చిన్నచూపు చూస్తారు. అదే ముల్లంగి మనకి కొన్ని లక్షలరూపాయలను ఆస్పత్రి పాలు కాకుండా కాపాడుతుంది. పచ్చకామెర్లు, మూత్రపిండాల వ్యాధులకి, మధుమేహం ఇలా ఎన్నో భయంకర వ్యాధులనుండి సాధారణ దగ్గు, జలుబులను చిటికలో తగ్గించే ఔషధం.
ఉపయోగాలు:
– ముల్లంగి రసం, పంచదార, తేనె – మూడూ సమపాళ్ళల్లో కలిపి పచ్చకామెర్లవాళ్ళకి ఇస్తే పది రోజులలో కామెర్లు తగ్గుతాయి.
– చిన్నపిల్లలకి రెండు చెంచాల ముల్లంగి రసం ఇస్తే కడుపులో నులుపురుగులు మాయ మౌతాయి.
– మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు ఒక చెంచా ముల్లంగి రసం, అర చెంచా ఉలవల రసం, అర చెంచా మెంతుల పిండిని కలిపి ప్రతి దినం త్రాగడం వల్ల ఆ రాళ్ళు కరిగిపోతాయి.
– ఆడవాళ్ళకి మూత్ర నాళి జబ్బులకి ఒక కప్పు ముల్లంగి రసం, పంచదార వేసి రోజుకి 5, 6 గ్లాసులు తాగితే ఒక్క రోజులో తగ్గుతుంది
– తేలు కుట్టిన చోట ముల్లంగి ముక్కకి ఉప్పు రాసి దానితో రుద్దితే ఆ ప్రాంతంలో రక్తం విషమయం కాకుండా కాపాడుతుంది
– పాఠశాలలకు వెళ్ళే పిల్లలకి ముల్లంగి ముక్కలను, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసంతో కలిపి ఇస్తే కడుపులో నొప్పి తగ్గుతుంది
– అంతే కాకుండా ముల్లంగి ముద్దకి ఉప్పు రాసి గజ్జి, తామర ఉన్నచోట పూస్తే తగ్గిపోతుంది.
– ఇల చెప్పుకుంటూ పోతే ఎన్నో అమూల్యమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకని ప్రతి దినం ఒక చిన్న ముల్లంగి మొక్క తినడం వల్ల సర్వరోగాలు నివారింపబడతాయి.
– ఉషాలావణ్య పప్పు