18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీలోనే రాణా… నేటి నుంచే విచారణ ప్రారంభం

ముంబై మారణ హోమం సూత్రధారి తహవ్వుర్ రాణా భారత్ కి వచ్చాడు. అమెరికాలోని లాస్‌ఏంజిలిస్లో సలో అక్కడి అధికారుల నుంచి రాణాను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్‌వేస్‌లోవిమానం ల్యాండ్‌ అయింది. అక్కడే రాణాను లాంఛనంగా అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో పటియాలా హౌస్‌ ఎన్‌ఐఏ కోర్టుకు తరలించి న్యాయమూర్తి చందర్‌జిత్‌ సింగ్‌ ఎదుట హాజరుపర్చారు.

విచారణ సందర్భంగా పాటియాలా హౌజ్ కోర్టు రాణాను 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి పంపాలని ఆదేశించింది. తమ వద్ద బలమైన ముఖ్యమైన ఆధారాలున్నాయని, కొన్ని ఇమెయిల్స్ కూడా వున్నాయని, వాటి ఆధారంగా అతడ్ని విచారించాలని కోరింది. ఉగ్రదాడికి సంబంధించిన పెద్ద కుట్రను ఛేదించడానికి రాణాను ప్రశ్నించాల్సి వుందని ఎన్ఐఏ న్యాయమూర్తి ముందు అభ్యర్థించింది.

అయితే ఎన్ఐఏ రాణాను 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా… కోర్టు మాత్రం 18 రోజుల కస్టడీకి ఆమోదించింది. దీని తర్వాత గట్టి భద్రత మధ్య రాణాను కోర్టు నుంచి ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. రాత్రి అక్కడే వుంచారు.

రాణాను ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లోని లాకప్ లో వుంచనున్నారు. ఇవ్వాళ ఉదయం నుంచి ఎన్ఐఏ ప్రత్యేక బృందం విచారణ ప్రారంభిస్తుంది.

పీటీఐ వార్తా సంస్థ ప్రకారం మరో కీలక విషయం తెలిసింది. దాడిని ప్లాన్ చేయడంలో రాణా ముఖ్య పాత్ర పోషించాడని, భారత్ కి వచ్చే ముందే అతనితో ఈ ఆపరేషన్ గురించి మొత్తం చర్చలు కూడా జరిగినట్లు పేర్కొంది. అంతేకాకుండా డేవిడ్ హెడ్లీ రాబోయే పరిణామాలను ముందే అంచనా వేసి, తన ఆస్తుల వివరాలు కూడా రాణాకు చెబుతూ.. ఓ ఈమెయిల్ పంపినట్లు తెలుస్తోంది. అలాగే ముంబై ఉగ్రదాడిలో పాక్ ఇస్లామిక్ ఉగ్రవాదుల తోడ్పాటు గురించి కూడా రాణాకు ఈ ఈమెయిల్ చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎన్ఐఏ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ మరియు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్ర మాన్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. మీకు న్యాయవాది వున్నారా? అంటూ రాణాను ప్రశ్నించగా.. లేరని సమాధానమిచ్చాడు.దీని తరువాత, రానా తరపున వాదించడానికి ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పియూష్ సచ్‌దేవాను నియమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *