మునగాకు
మనం నిరంతరం తీసుకొనే ఆహార పదా ర్థాల్లో, మన ఆరోగ్యానికి దోహదం చేసే పలు కూర గాయల్లో మునగ ప్రత్యేక విశిష్టత కలిగి ఉంది. మన దైనందిన ఆహారంలో అంతర్భాగమై మన ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం దోహదపడుతుంది. మునక్కాయలే కాకుండా ఆకులలోను ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మునగాకులో విట మిన్లు, అమైనో ఆమ్లాలు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉన్నాయి. క్యారెట్ల కన్నా మునగాకులో పదిరెట్ల విటమిన్ ‘ఎ’ ఉంటుంది. కళ్ళ జబ్బులకు ఔషధంగా మునగాకును వాడుతారు. పాలనుండి లభించే కాల్షియం కన్నా మునగాకు నుండి లభించే కాల్షియం 17 రెట్లు ఎక్కువ. అలాగే అరటిపండ్ల నుంచి పొందే పోటాషియం కన్నా 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుండి పొందవచ్చు. మునగాకులో ఉన్న క్లోరోజెనిక్ ఆసిడ్ రక్తంలోని చక్కెర స్థాయిని నియం త్రిస్తుంది. థైరాయిడ్ని నియంత్రించగల గుణం మునగాకులో ఉంటుంది.
ఊపిరితిత్తులు, కాలేయం, ఒవేరియన్, మెల నోమా వంటి క్యాన్సర్లను కూడా నిరోధించే శక్తి ఈ మునగాకుందని తాజా పరిశోధనల్లో వెల్లడయింది. మునగాకును నూరి లేపనముగా చేసి కట్టుకట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు తగ్గుతాయి. బాలింత లకు మునగాకు రసం శ్రేష్ఠమైనది. ఇందులో కాల్షియం, ఇనుప ధాతువు, విటమిన్లు పుష్కలంగా లభించడంతో ఇది ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల తల్లులతో పాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాల్షియం లోపమున్న వారికి మునగాకు మేలు చేస్తుంది. మునగాకు, మునగకాయలు, మునగపూలు మొదలగువన్నీ అత్యంత పోషక విలువలతో ఉండి, శ్రేష్ఠమై పౌష్టికా హారంగా ఉపయోగపడుతుంది.