పాక్ సీరియల్స్ తో కుటుంబ సంబంధాలకు దెబ్బ : మౌలానా ఖారీ ఇషాక్
పాకిస్తాన్ సీరియల్స్ పై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ముస్లిం సమాజం నుంచే ఈ తీవ్రవత మరింత పెరుగుతోంది. పాకిస్తాన్ సీరియల్స్ కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తున్నాయని, ముస్లింలలో విడాకుల కేసులు పెరగడానికి కూడా కారణం అవుతున్నాయని దేవబంద్ మౌలానా ఖారీ ఇషాక్ గోరా మండిపడ్డారు.సహరాన్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాక్ సీరియల్స్ తో ఇళ్లు ఛిద్రం అవుతున్నాయని, మనుషుల్లో విషం నింపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మానవ సంబంధాలను తెంచేస్తున్నాయన్నారు.
“పాకిస్తానీ టీవీ సీరియల్స్ మన ఇళ్లను సంఘర్షణ, ద్వేషంతో నింపేశాయి. ఈ నాటకాలు కుటుంబ సామరస్యాన్ని చెడగొడుతున్నాయి మరియు పెరుగుతున్న విడాకుల కేసులకు కారణమవుతున్నాయి” అంటూ మండిపడ్డారు.పాకిస్తాన్ కేంద్రంగా వచ్చే సీరియల్స్ లో నిత్యం అత్తా కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీలను అణచివేయడం, భార్య భర్తల మధ్య తగాదాలను చూపిస్తున్నారని, దీంతో మనుషులపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. దీంతో మానవ సంబంధాలు ిద్రం అవుతున్నాయని అన్నారు. ప్రజలు అలాంటివి చూడటం మానేయాలని పిలుపునిచ్చారు.