సంభాల్ హింసకి హిందువులే కారణం : ముస్లిం నేత

యూపీలోని సంభాల్ జిల్లాలో జరిగిన హింసకి హిందువులే కారణమట. ఈ నిందను వేసింది మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ. హిందువులు ప్రతి మసీదు కింద శివలింగం మూలాలను వెతికితే శాంతి వుండదంటూ నోరు పారేసుకున్నారు. ఈ మేరకు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పై హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు. యూపీ సంభాల్‌లోని షాహీ జామా మసీదును హరిహర్ దేవాలయంగా పేర్కొనడంతో ఈరోజు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఏఎస్ఐ సర్వే బృందం తెల్లవారుజామున జామా మసీదుకు చేరుకుంది. మసీదు రీ సర్వే విషయం తెలిసిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున మసీదు వెనుక గుమిగూడారు. జనం తోపులాట సృష్టించి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. రాళ్లదాడిలో ఎస్పీ పీఆర్వో గాయపడ్డారు.
సిద్దిఖీ రాజకీయ జీవితమే పూర్తిగా వివాదాస్పద చరిత్ర. సహరాన్ పూర్, ముజఫర్ నగర్ లోని ప్రతి మదర్సాకూ ఆయన డబ్బులిచ్చాడు. ఎంపీగా వున్న సమయంలో ఎంపీ ల్యాండ్స్ నుంచి ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని ఆయనే గొప్పగా చెప్పుకుంటాడు. ఓ వీడియోలో సహరాన్ పూర్ లోని మదర్సాకి ఎలా సహాయం చేశారో ఆయనే స్వయంగా చెప్పాడు. ఇది బాగా వైరల్ కూడా అయ్యింది. ఈ మదర్సాల కోసం కోట్లాది రూపాయలు ఇచ్చానని ఆయనే చెప్పుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *