కాలేజీ లో నమాజ్ కోసం మాకు ప్రత్యేక గది కావాలి: ముస్లిం విద్యార్థుల ఛాందసవాదం
కేరళలోని చర్చి ఆధ్వర్యంలో నడిచే నిర్మల కళాశాలలో ముస్లిం యువకులు రభస సృష్టించారు. కళాశాలలో నమాజ్ చేయడానికి తమకంటూ ఓ ప్రత్యేక స్థలం కేటాయించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను క్రైస్తవ కాలేజీ యాజమాన్యం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. దీంతో ముస్లిం యువకులు నానా రచ్చ చేశారు. నిర్మలా కాలేజీలోని ఓ గదిలో శుక్రవారం కొందరు బాలికలు నమాజ్ చేస్తున్నారు. దీనిని కొందరు కాలేజీ ఉద్యోగులు గమనించారు. ఇలా నమాజ్ చేయడం కుదరదన్నారు. దీంతో ముస్లిం బాలికలు రచ్చ రచ్చ చేశారు. ఆ తర్వాత మరికొందరు వచ్చి గొడవ చేశారు. దీంతో నిరసనలు మరింత ఎక్కువయ్యాయి.
అయితే.. కళాశాలకు మసీదు చాలా దగ్గర్లోనే వుంది. అయితే.. కాలేజీకి సమీపంలోనే నాలుగు మసీదులు కూడా వున్నాయి. అందులోని ఓ మసీదు మహిళలకు నమాజు చేసుకోవడానికి కూడా అనుమతినిచ్చింది. అయినా సరే… ముస్లిం విద్యార్థులు ఈ డిమాండ్‌ను పెట్టారు.దీంతో యాజమాన్యం నిరాకరించింది. ఇక… ముస్లిం బాలికలు కాలేజీ ప్రిన్సిపాల్ ఫాదర్ కనదన్ ఫ్రాన్సిస్‌ను ఘెరావ్ చేశారు. అంతేకాకుండా ప్రిన్సిపాల్‌ని గదిలో నిర్బంధించారు. ఈ నిరసనకు ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ సారథ్యం వహించింది. అయితే.. ఈ స్టూడెంట్ ఫెడరేషన్ వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ మద్దతు కూడా వుంది.
ఈ గొడవపై కాలేజీ ప్రిన్సిపాల్ తీవ్రంగా స్పందించారు. కాలేజీకి సమీపంలోనే నాలుగు మసీదులు వున్నాయని పేర్కొన్నారు. అందులో ఓ మసీదు మహిళలకు నమాజ్ చేయడానికి అనుమతిని కూడా ఇచ్చింది. అయినా సరే.. ప్రత్యేక గది కావాలన్న డిమాండ్ ఏంటిదని మండిపడ్డారు.
మరోవైపు ఈ ఘటనపై సాధారణ ప్రజానీకం కూడా తీవ్రంగా స్పందించింది. దీనిని చూస్తే ఛాందసవాదం ఎంతలా ప్రబలిందో అర్థమైపోతోందన్నారు. ఇలా ఓ పద్ధతి ప్రకారం విద్యార్థుల మెదళ్లలో నింపుతున్నారని, ఇలాంటివి అనుమతిస్తే.. విద్యా సంస్థలన్నింటికీ ఇలాంటి డిమాండ్లే వస్తాయని మండిపడుతున్నారు. కేరళలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అంటున్నారు.