సికింద్రాబాద్ లో అమ్మవారి దేవాలయంపై దాడి… ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం

హైదరాబాద్ లో వరుసగా హిందూ దేవతలపై, దేవాలయాలపై దాడులు జరుగుతూనే వున్నాయి. మొన్నటికి మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అమ్మవారి విగ్రహాన్ని ఛాందసులు ధ్వంసం చేశారు. అది మరిచిపోక ముందే మరో ఘటన జరిగింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసే ముందు నిందితుడు ఆలయ గేట్ ను కాలితో తన్నాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లాడు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి, అక్కడి వస్తువులను చెల్లాచెదురు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో మొత్తం సీసీ కెమెరాలో నిక్షిప్తమై వుంది.
ఈ ఘటన జరగ్గానే నిందితుడ్ని స్థానికులు చితకబాదారు. ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పరారీలో వున్నారు. మరోవైపు హిందూ సంఘాలు, భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఛాందసులు పనిగట్టుకొని, హిందూ దేవాలయాలు, దేవీ దేవతలను ధ్వంసం చేస్తున్నారని, అయినా సరే ప్రభుత్వం ఏమీ చేయడం లేని హిందువులు మండిపడుతున్నారు. పరారీలో వున్న వారిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *