బావులు తవ్వించుకొని, అద్భుతమైన పంటలు పండిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆకర్షించిన రైతులు

రానూ రానూ నీటివనరుల సౌలభ్యం తగ్గిపోతోంది. దీనికి కారణం వర్షాలు బాగా తగ్గిపోవడం. దీంతో అన్ని రంగాలపై దీని ప్రభావం ప్రస్ఫుటంగా ద్యోతకమవుతూనే వుంది. ఎండాకాలం వచ్చిందంటే అంతే సంగతులు. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో రైతులకు నీటి వసతి వుంది కానీ… చాలా మట్టుకు తక్కువే. చెరువులు, కుంటలు, కెనాల్ కూడా పూర్తిగా ఇంకిపోతుంది. ఇక… బోర్లు వేయించడమే గతి. బోర్లు కూడా సక్సెస్ కాకుంటే.. రైతు గతి ఏం కావాలి? అత్యంత దీనంగా తయారవుతుంది.

 

ఇలాంటి పరిస్థితే తెలంగాణలోని నకిరేకల్ లోని చందుపట్ల గ్రామంలోని రైతులకు ఎదురైంది. ఒక్కో గ్రామంలో నాలుగవందల వరకూ బోర్లు వేయించిన దాఖలాలు కూడా వున్నాయి. అయినా చుక్క నీరు రాలేదు. వానాకాలంలో పంటకి సరిపడా వర్షాలు పడలేదు. దీంతో రైతులు తాము పండించే విస్తీర్ణాన్ని తగ్గించుకుంటున్నారు. ఇంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో చందుపట్ల ప్రాంతం పెద్ద మనుషులు, చదువుకున్న వారందరూ కూర్చొని ఆలోచించారు. చివరికి కొందరు చేసిన ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలు చూపిస్తోంది. దీంతో బోర్ల నుంచి నీరు ఒక్కసారిగా బయటికి వచ్చినట్లు.. రైతులు ఒక్కసారిగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

 

రైతులు సక్సెస్ కావానికి ఉపాధి హామీ పథకం ఉపకరించింది. గ్రామంలోని చిన్న, సన్నకారు రైతులు ఉపాధి హామీ కింద బావులు తవ్వించుకున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కాస్త కరువు ఛాయలు కనిపించినా… వారి పరిసర ప్రాంతాలు, ఆ వ్యవసాయ పొలాల్లోని బావుల్లో మాత్రం నీరు పుష్కలంగా వుంది. ఈ వార్త ఢిల్లీకి కూడా పాకింది. ఇంతలా బావులు తవ్వించుకొని, రైతులు ఎలా సక్సెస్ అవుతున్నారని ఆశ్చర్యపోవడం కేంద్ర ప్రభుత్వ జల నిపుణుల వంతైంది. దీంతో కేంద్ర ప్రభుత్వ జల నిపుణుల బృందం ఇక్కడ పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు ఇలా బావులు తవ్వించుకొని, పంటను బాగా పండిస్తూ.. ఆర్థికంగా మెరుగవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులందర్నీ అభినందించారు. సుమారు 15 లక్షలతో దాదాపు 8 నుంచి 10 బావులు తవ్వించారు. గత ఏడు సంవత్సరాల నుంచి ఈ బావుల్లో నీరు పుష్కలంగా వుంది. తమకు బావులు కావాలంటే రైతులు దరఖాస్తులు చేసుకుంటే, గ్రామ సభ ఆమోదంతో స్థానిక ప్రభుత్వ అధికారులు బావులు మంజూరు చేశారు. దీంతో రైతులు సంప్రదాయ పంటలే కాకుండా కూరగాయలు, పండ్లను పండించి, విజయ పథంలో నడుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *