నలంద మళ్ళీ నిలబడిరది

బిహార్‌లోని చారిత్రక నలంద విశ్వవిద్యా లయం నూతన క్యాంపస్‌ను జూన్‌ 19న రాజ్‌గిర్‌లో ప్రధాని ప్రారంభించారు. 1600 సంవత్సరాల క్రితం భారతీయ విద్యకు ప్రధాన వేదికగా నిలిచిన నాటి అసలు విశ్వవిద్యాలయం భక్తియార్‌ ఖిల్జీ కర్కశ దాడుల అగ్నికీలల్లో విధ్వంసానికి గురికాగా, జ్ఞానానికి, పాండిత్యానికి దీపమై ఒక వెలుగు వెలిగిన ఈ ప్రాచీన అధ్యయన కేంద్రం పునరుద్ధర ణకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది. 2016లో యునెస్కో ప్రపంచవారసత్వ సంపదగా ప్రకటించిన నలంద శిధిలాలు ఈ విశ్వవిద్యాలయ గత వైభవానికి ప్రతిబింబాలుగా నిలిచాయి.

ప్రపంచంలో తొలి ఆవాస విశ్వవిద్యాలయమైన పురాతన నలంద విశ్వవిద్యాలయం 1600 సంవత్సరాల క్రితం ఐదో శతాబ్దంలో స్థాపించ బడిరది. ఈ విశ్వవిద్యాలయం ఆసియాలోని విఖ్యాత పండితులెందరినో ఆకర్షించి ప్రపంచంలోనే గొప్ప అధ్యయన కేంద్రంగా భాసిల్లింది. అయితే… భక్తియార్‌ ఖిల్జీ చేసిన ఘోర దాడిలో నలంద విశ్వవిద్యాలయం అగ్నికి ఆహుతయి ధ్వంసమైంది. ఖిల్జీ కిరాతక చర్య వల్ల ఇక్కడి గ్రంథాలయంలోని 90 లక్షల గ్రంథాలు, తాళపత్రాలు అగ్నికీలల్లో కాలిపోతూ ఎగసిన మంటలు 3 నెలల పాటు ప్రజ్వరిల్లాయని చరిత్ర చెబుతోంది.

‘‘నెట్‌ జీరో గ్రీన్‌ క్యాంపస్‌’’గా కొత్త క్యాంపస్‌

నలందా కొత్త క్యాంపస్‌ను నెట్‌ జీరో క్యాంపస్‌గా రూపొందించారు. అంటే పర్యావరణ అనుకూలంగా రూపుదిద్దబడిరదని అర్థం. ఈ కొత్త క్యాంపస్‌లో 40 తరగతి గదులున్న రెండు అకడమిక్‌ బ్లాకులున్నాయి. ఇక్కడ మొత్తం 1900 మంది విద్యార్థులకు సామర్థ్యం ఉంది. 300 సీట్లున్న రెండు సభామందిరాలు కూడా వున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ కేంద్రం, యాంఫీ థియేటర్‌ కూడా వుంది. ఇందులో 2 వేల మంది కూర్చునే సామర్థ్యం వుంది. ఇవి మాత్రమే కాకుండా విద్యార్థులకు ఫ్యాకల్టీ క్లబ్‌, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌తో సహా అనేక ఇతర సౌకర్యాలున్నాయి.

ఇప్పుడు కొత్తగా పునరుద్ధరించిన నలందా విశ్వవిద్యాలయం విద్యా సంబంధాల మెరుగుదల, చారిత్రక సంబంధాల పరిరక్షణ లక్ష్యంగా భారత్‌, ఈస్ట్‌ ఏషియా సమిట్‌ (ఈఏఎస్‌) దేశాల భాగ స్వామ్యంతో రూపుదిద్దుకుంది. సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థ, తాగునీటి శుద్ధి వ్యవస్థ, వ్యర్థజలాల పునర్వినియోగ వ్యవస్థలు, 100 ఎకరాలలో నీటి వనరులతో పాటు అనేక పర్యావరణ అనుకూలమైన సదుపాయాలున్నాయి. కొత్త అధ్యయనానికి తెరతీసిన ఈ నూతన నలంద విశ్వవిద్యాలయం… అలనాటి నలంద స్ఫూర్తిని అందిపుచ్చుకుని, అధ్యయనం – ఆవిష్కరణల కీలక కేంద్రంగా నిలుస్తూ విద్యా రంగంలో ఉత్కృష్ట సంప్రదాయాలను నిలబెట్టేందుకు కృషి చేసే దిశగా ఆశలను రేకెత్తిస్తోంది. నలంద నూతన క్యాంపస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, భూటాన్‌, బ్రూన్కె, దారు స్సలాం, కంబోడియా, చ్కెనా, ఇండోనేషియా, లావోస్‌, మారిషస్‌, మయన్మార్‌, న్యూజిలాండ్‌, పోర్చుగల్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, శ్రీలంక మరియు వియ త్నంతో సహా మొత్తం 17దేశాల నుంచి విదేశీ రాయ బారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *