సంఘటితంతోనే విచ్ఛిన్న శక్తులను ఎదుర్కోగలం – నారద జయంతి సభలో ఐవైఆర్‌ కృష్ణారావు

కమ్యూనిస్టులు చాలా పద్ధతి ప్రకారం దుష్ప్రచారాలు చేస్తున్నారని, దానిని పూర్తిగా సంఘటితం అవ్వడం ద్వారానే తట్టుకోగలమని ఆంధ్రప్రదేశ్‌ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణా రావు అన్నారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు చాలానే వున్నాయని, అన్ని చోట్లా వున్నాయని, జాగ్రత్తగా వుండాలని హెచ్చరించారు . ఎల్లప్పుడూ విచ్ఛిన్న శక్తులు విచ్ఛిన్నకర ప్రయత్నాలలోనే ఉంటాయని , కానీ..వాటిని కౌంటర్‌ చేయాలంటే జాతీయవాద శక్తులు ఏకం కావాల్సిందేనని నొక్కి చెప్పారు. ఈ ఏకం చేసే పనిని సమాచార భారతి పని చేస్తోందని అన్నారు. నారద జయంతి సందర్భంగా సమాచార భారతి ఆధ్వర్యంలో భాగ్యనగర్ లోని లకడీకాపుల్ FTCCI సురానా హాల్ లో పాత్రికేయులకు సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐవైఆర్‌ కృష్ణారావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు జర్నలిజం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుందని, ఇపుడు సోషల్ మీడియా యుగం నడుస్తోందని ఆంధ్రప్రదేశ్‌ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణరావు అన్నారు. గతంలో జర్నలిజంలో అంతా మేనేజ్‌మెంట్‌ యుగమే నడిచిందని, ఇప్పుడు పాత్రికేయులే కాకుండా సవమాన్య పౌరులు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా అయిపోతున్నారని, ఇదో కొత్త పంథా అని తెలిపారు. అయితే.. ఇందులో మంచి, చెడూ రెండూ వున్నాయని, ఫేక్‌ న్యూస్ బాగా ప్రచారం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నారద మహర్షి చాలా యుగాల నుంచి కూడా వున్నారని, ఆయన ఏ యుగానికి సంబంధించిన మహర్షో చెప్పడం కూడా కష్టమేనన్నారు. అన్ని యుగాలలోనూ నారదుడు వుంటారన్నారు. రావణాసురుడు, నరకాసురుడి దగ్గరకు కూడా వార్తలు చెప్పడానికి నారదుల వారు వెళ్లారన్నారు. కానీ అక్కడ బెదిరింపులు వుండేవి కావన్నారు. కానీ… నేటి ఆధునిక యుగంలో తమకు అనుకూలంగా రాయాలంటూ పాత్రికేయులను బెదిరించే రోజులు వచ్చేశాయని ఐవైఆర్‌ కృష్ణా రావు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *