’50 ఆయుధాలకే పాక్​ తోకముడిచింది’ : వైస్​ చీఫ్​ ఎయిర్​ మార్షల్​

పాకిస్థాన్​ సైనిక లక్ష్యాలపై భారత వైమానిక దళం 50 కంటే తక్కువ ఆయుధాలు ప్రయోగించిందని వైస్​ చీఫ్​ ఎయిర్​ మార్షల్​ నర్మదేశ్వర్​ తివారీ అన్నారు. దాంతో మే 10 నాటికి యుద్ధం ముగింపు పలకాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మే 9, 10 తేదీల మధ్య​ పాక్​పై జరిపిన దాడుల్లో భారత వైమానిక దళం పూర్తి అధిపత్యం సాధించగలిగిందని తెలిపారు. ఓ జాతీయ మీడియా సదస్సులో ఆపరేషన్​ సిందూర్​కు సంబంధించి సరికొత్త విషయాలను ఆయన పంచుకున్నారు.

ఆపరేషన్​ సిందూర్​ సమయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్​ ఐఏఎఫ్​ అధికారి నర్మదేశ్వర్​ తివారీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల గురించి వివరించారు. అత్యంత కచ్చితత్వంతో పాకిస్థాన్​లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళాలు విరుచుకుపడ్డాయని ఆయన తెలిపారు. దీంతో దాయాది దేశం కాళ్లబేరానికి వచ్చిందన్నారు. అందుకు భారత వైమానిక దళం 50 కంటే తక్కువ ఆయుధాలనే ప్రయోగించిందని వెల్లిడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *