మేనిఫెస్టోలో హిందూ వారసత్వ ప్రదేశాలకు ఇస్లామిక్ పదజాలం వాడిన నేషనల్ కాన్ఫరెన్స్

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఆసన్నమవుతున్న తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అత్యంత వివాదాస్పద మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టో విషయంలో అత్యంత ఘాతుకానికి పాల్పడింది. హిందూ దేవాలయాలన్నింటినీ ఇస్లాం పేర్లతో చూపుతూ మేనిఫెస్టోలో చేర్చింది.వీటితో పాటు ఆర్టికల్ 370ని పునరుద్ధరణ విషయం కూడా అందులో ప్రస్తావించింది. ఇక.. జమ్మూ కశ్మీర్ లో హిందూ వారసత్వానికి అత్యంత ముఖ్యమైన శంకరాచార్య కొండను తఖ్త్ ఇ సులైమాన్ మరియు హరి పర్బత్ అని, కోహ్ ఎ మారన్ అంటూ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రాచీన హిందూ వారసత్వ ప్రదేశాలకు ఇస్లామిక్ పదజాలాన్ని వాడారు. ఆర్టికల్ 370, 35ఏ ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా వేర్పాటువాద భావాలకు మళ్లీ ప్రాణం పోస్తున్నారని అర్థమైపోతోంది.
ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ పర్యాటక రంగంలో దూసుకెళ్లింది. దాదాపు 1.88 కోట్ల మంది పర్యాటకులు స్వేచ్ఛగా వచ్చి వెళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ… నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో ద్వారా మళ్లీ జమ్మూ కశ్మీర్ పర్యాటక రంగం పూర్తిగా చిక్కుల్లో ఇరుక్కుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పబ్లిక్ సేఫ్టియాక్ట్ (PSA)ని రద్దు చేస్తామని కూడా పేర్కొన్నారు. పౌర స్వేచ్ఛ కోసం ఇది అత్యంత ఆవశ్యకమని తన మేనిఫెస్టోలో తెలిపారు. వీటితో పాటు భారత్, పాక్ చర్చల అంశాన్ని కూడా ప్రస్తావించారు. జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షల కోసం మళ్లీ చర్చలు ప్రారంభించాలని వాదించింది.అలాగే యూసీసీ, సీఏఏని కూడా తీవ్రంగా వ్యతిరేకించింది.మరోవైపు కశ్మీరీ పండిట్ ల పునరావాసం విషయంలో తమకు నిబద్ధత వుందని పేర్కొంది.మతపరమైన ఇబ్బందులను దూరం చేయడానికి ఓ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *