జాతీయ విద్యా విధానం అమలు సమాజానికి ఎంతో అవసరం

జాతీయ విద్యా విధానం 2020ని విద్యా లయాల్లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని విద్యా వేత్తలు అభిప్రాయపడ్డారు. భారత దేశంలో సుమారు 23వేలకు పైగా పాఠశాలల్ని నడుపుతున్న విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌ ‌హైదరాబాద్‌ ‌శారదాధామంలో ఈ నెల 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ కీలక సమావేశాలు సోమవారం మధ్యా హ్నంతో ముగిశాయి. ఈ అంశం మీద విద్యా భారతికి చెందిన అగ్ర శ్రేణి నాయకత్వం హాజరై చర్చలు జరిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన 50 మంది ప్రతినిధులు హాజరై జాతీయ విద్యా విధానం అమలు, తీరుతెన్నుల మీద చర్చించారు.

విద్యా విధానం సరైన తీరులో ఉన్న సమాజమే ఉన్నత స్థితికి చేరుతుంది. సమాజంలో వివిధ రకాల ఉద్యోగులు, సిబ్బందిని తయారు చేసే విద్యా విధానం కన్నా, సమర్థవంత మైన పౌరుల్ని తయారుచేసే పద్దతులు మేలు అన్నది జగమెరిగిన సత్యం. ఈ ఉద్దేశ్యంతో రూపొందిన జాతీయ విద్యా విధానం 2020 పట్ల అపోహలు తొలగించాలని సమావేశం అభిప్రాయ పడింది. విలువలతో కూడిన విద్యను అందించేందుకు పెద్దపీట వేయాలని సమావేశం పిలుపు ఇచ్చింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మాజీ వైస్‌ ‌ఛాన్సలర్లు, సంఘటనా కార్యదర్శులు, విద్యా వేత్తలు హాజరై చర్చించారు. విద్యా భారతి అఖిల భారతీయ అధ్యక్షులు దూసి రామక్రిష్ణరావు, ప్రధాన కార్యదర్శి అవినీష్‌ ‌భట్నాగర్‌, ‌జాతీయ సంఘటన కార్యదర్శి గోవింద్‌ ‌మహంతో, ఉన్నత విద్యా జాతీయ సంఘటన కార్యదర్శి రఘునందన్‌, ‌దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *