దక్షిణాది రాష్ట్రాల్లో సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం

పరంపరాగత్ కృషి వికాస్ యోజన ద్వారా 2015-16 నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం కింద సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి 3 సంవత్సరాల్లో హెక్టారుకు రూ. 31,500 సహాయం అందిస్తారు. ఇందులో పొలం/పొలం వెలుపల సేంద్రీయ ఇన్‌పుట్‌ల కోసం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా రైతులకు హెక్టారుకు రూ. 15,000 సహాయం అందిస్తారు. ఈ ఆర్థిక సహాయంలో సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ మద్దతూ భాగంగా ఉంటుంది.

ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి 6236.35 లక్షలు కేంద్రం విడుదల చేసింది. అందులో 32,940 హెక్టార్లలో సేంద్రీయ సాగు జరిగింది.

ఇక.. కర్నాటకలో 10049.36 లక్షలు విడుదల కాగా, 49,100 హెక్టార్లలో సేంద్రీయ వ్యవసాయం జరుగుతోంది.

కేరళలో 6732.97 లక్షలు విడుదల కాగా, 94,480 హెక్టార్లలో సేంద్రీయం జరుగుతోంది.

తెలంగాణలో 3576.78 లక్షలు విడుదల కాగా, 8,100 హెక్టార్లలో సేంద్రీయం జరుగుతోంది.

పీకేవీవై పథకం కింద రైతులకు 3 సంవత్సరాల కాలానికి ప్రయోజనాలు అందిస్తారు. 2024-25 కాలానికి కర్ణాటకలో 11,630 మంది రైతులు, తమిళనాడులో 28,983 మంది రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందారు. అయితే, 2024-25 కాలానికి కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు నిధులు కేటాయించినా ఎటువంటి ఖర్చు చేయలేదు. ఈ కారణంగా రైతులెవరూ ప్రయోజనం పొందలేదు.

గత మూడు సంవత్సరాలతో పాటు ప్రస్తుత సంవత్సరం పీకేవీవై పథకం కింద తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణకు కేటాయించిన నిధుల (కేంద్ర వాటా) వివరాలు కింది విధంగా ఉన్నాయి:

ఇక.. గత రెండేళ్లలో తమిళనాడులో

2022-23 లో 704.87 లక్షల రూపాయలు
2023-24 లో 1564 లక్షల రూపాయలు
2024-25 లో 16200 లక్షలు
2025-26 లో 1556.00 లక్షలు

కర్నాటకలో

2022-23 లో 1045.61 లక్షలు
2023-2024 లో 2803 లక్షలు
2024-2025 1950 లక్షలు
2025-2026 1769 లక్షలు

కేరళలో

2022-2023 లో 1712.07 లక్షలు
2023-2024 1047 లక్షలు
2024-2025 782.60 లక్షలు
2025-2026 1199.00 లక్షలు

తెలంగాణలో

2022-2023 30.75 లక్షలు
2023-2024 568.00 లక్షలు
2024-2025 424.60 లక్షలు
2025-2026 1989.00 లక్షలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *