గ్రామ భారతి, శ్రీసాయి సేవాసమితి ట్రస్ట్ సాయిధామం సేవాశ్రమం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ
గ్రామ భారతి తెలంగాణ శ్రీసాయి సేవాసమితి ట్రస్ట్ సాయిధామం సేవాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో రైతుల కోసం ప్రకృతి గో వ్యవసాయ ఆధారిత వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం జరిగింది. శ్రీశ్రీశ్రీ స్వామీ శ్రీరామానందప్రభుజీ స్వామి వారి ఆశీస్సులతో నవ నిర్మాణ ఫౌండేషనÊ, భారతీయ కిసాన్ సంఫ్‌ు సంస్థలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. ఈ సందర్భంగా గోకృపామృతం, దేశీ విత్తనాల తయారీ, ఎరువుల తయారీపై శిక్షణనిచ్చారు. అలాగే కషాయాల తయారీపైన కూడా నిపుణులతో అవగాహన కల్పించారు.
ఈ విషయాలతో పాటు మట్టిపరీక్ష, నేల ఆరోగ్యం, మొక్కల ఎదుగుదలకు, దిగుబడులకు అవసరమైన పోషకాల ఉపయోగం, హెచ్చు, తగ్గు లక్షణాలను గుర్తించడం, సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం లాంటి విషయాలపై కూడా శిక్షణనిచ్చారు. ఈ విషయాల్లో అనుభవం గడిరచిన మనోహరచారి, నవనిర్మాణ సంస్థ అధ్యక్షులు రాంబాబు, శ్రీ మదన్ గుప్తా, నారాయణ, ప్రగతి, వెంకన్న తదితరులు మార్గదర్శనం చేశారు. ఈ ఉచిత శిక్షణా సదస్సుకి 66 గ్రామాల నుంచి, 41 మండలాలు, 16 జిల్లాల నుంచి 135 మంది రైతులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలకి చెందిన ఔత్సాహిక రైతులు వచ్చారు.