నవీన ఆశా కిరణం – ఏకాత్మ సమాజ్ మండల్
ఎప్పుడూ చేతి బొటన వేలిముద్రను వేసే భామ ఆజీ.. మొదటి సారిగా తన సంతకం చేయగలిగి నందుకు ఆమె కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి. తన సొంత గ్రామం ‘ఖమ్ఖేడా’ పేరును ఆమె చదువగలుగుతోంది. ఔరంగాబాద్ లోని ‘ఖామ్ఖేడా’ గ్రామానికి చెందిన 65 ఏళ్ల ‘భామ ఆజీ’ ఈ వయసులో కూడా చదవడం నేర్చుకుని, చదు వుకు వయసుకు సంబంధం లేదని మరోసారి నిరూపిం చింది. ఇలా ఎంతో మంది మహిళలకు వయసుతో సంబంధం లేకుండా వారి విజయాలకు దారి చూపిస్తోంది సావిత్రిబాయ్ ఫూలే ఏకాత్మ సమాజ్ మండల్.
ఏకాత్మ సమాజ్ మండల్ గ్రామాల్లోని మహిళలకు, బాలికలకు తోడ్పాటునందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఔరంగాబాద్‌లోని ఇందిరా నగర్‌కు చెందిన ‘ఆశా’ అనే మహిళా మండల్ సహకారంతో అనేక కష్టాల నుంచి బయటపడిరది. మద్యానికి బానిసైన భర్త కుటుంబాన్ని పోషించలేక పోవడంతో జీవితం కష్టాల్లో కూరుకుపోయిన ‘ఆశా’ రెండు పూటలా కష్టపడుతోంది. ఆమెకు సావిత్రీ బాయి ఫూలే ఏకాత్మ సమాజ్ మండల్‌తో పరిచయం ఏర్పడి ఆమె ఇప్పుడు తన నర్సింగ్ బ్యూరోలో చేరి అనేక మందికి శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఉపాధిని కూడా అందిస్తోంది. మండల్ నుండి సరైన మద్దతుతో, తన ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ఆమె తన విద్యను తిరిగి ప్రారంభిం చింది. 10, 12 (సైన్స్) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మహిళల సాధికారత, కుటుంబం సంఘం పురోగతికి దారితీస్తుందనే మండల్ సిద్ధాంతం, భామ ఆజీ, ఆశా ఇటువంటి అనేకమంది మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. ఏకాత్మ సమాజ్ మండల్ అధ్యక్షుడు డా.దివాకర్ కులకర్ణిజీ వివరిస్తూ ‘‘మండల్ 302 మహిళా స్వయం-సహాయక బృందాలు, ఇతర సంక్షేమ పథకాల ద్వారా 2000 మంది సేవా వ్రతిలకు చేరువైంది. వీరు 43 కంటే ఎక్కువ ప్రాజెక్ట్ లను నడుపుతు న్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, సామాజిక పని, విద్య, వ్యవసాయం, నీరు, పిల్లలు, యుక్త వయస్కుల కోసం వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ఉచితంగా లేదా నామమాత్రపు ఛార్జీలతో సేవలను అందిస్తు న్నారు. ఈ ప్రాజెక్టుల లబ్ధిదారులు ఔరంగాబాద్ నగరంలో 45 వెనుకబడిన బస్తీలలో, 270 పరిసర గ్రామాలలో 55 లక్షలకు పైగా విస్తరించి ఉన్నారు.’’ అని తెలిపారు.
ఏకాత్మ సమాజ్ మండల్ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. 1989లో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెడికల్ ఫౌండేషన్‌కు చెందిన 7మంది వైద్యులు ఔరంగాబాద్‌లో డా. హెడ్గేవార్ ఆస్పత్రిని స్థాపించారు. పేదలకు తక్కువ ధరలతో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడమే ఈ ఆస్పత్రి ఉదాత్త సేవా లక్ష్యం. ఈ ఆస్పత్రి పట్టణంలోని మూడు వెనుకబడిన ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను స్థాపించింది. అయితే అట్టడుగున పరివర్తన సాధించాలంటే, పిల్లలకు విద్యను అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం తప్పనిసరి అని వ్యవస్థాపకులు గ్రహించిన తర్వాత 1994లో ఏకాత్మ సమాజ్ మండల్ స్థాపనకు దారితీసింది. ఏకాత్మ సమాజ్ మండల్ ట్రస్టీ మాధురిజీ మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో పేదరికం అధికంగా ఉందని అన్నారు. 16 ఏళ్ల ప్రియాంక మండల్ సహాయంతో చదువు పూర్తి చేసింది. ముకుంద్వాడిలో కరాటే శిక్షణ తీసుకోవడంలో కూడా మండల్ ప్రియాంకకు సహకరించింది. ఆమె ఇప్పుడు జాతీయ స్థాయి బ్లాక్-బెల్ట్ ఛాంపియన్, అలాగే ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఇతర పిల్లలకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేస్తోంది.
ప్రతి విజయగాథతో, అమ్మాయిలను స్వతంత్ర, ఆత్మవిశ్వాసం గల వ్యక్తులుగా మారుస్తోంది. మండల పరిధిలో 18 విద్యార్థి వికాస్ కేంద్రాలు (బాలుర), 19 కిశోరి వికాస్ కేంద్రాలు (బాలికల కోసం) నడుస్తున్నాయి. ఇందులోని పది కేంద్రాలలో 15000 మంది బాలబాలికలకు సహేతుకమైన విద్యను అందించడానికి పని చేస్తున్నారు. విద్యను మధ్యలో వదిలేసే వారిని గుర్తించి తిరిగి చదువుకు నేందుకు ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. అదేవిధంగా కౌమారదశపై అవగాహన ప్రచారాలు, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను జాగ్రత్తగా చూసుకుంటారు. వీటి ద్వారా, ఈ యువతరం ప్రత్యేకంగా మహిళలు అక్షరాస్యులు, సమర్థులు, స్వావలంబన కలిగిన వ్యక్తులుగా అభివృద్ధి చెందుతున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, విద్యార్థులకు స్వావలంబన సాధించే మార్గాలను బోధించడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తున్నాయి. మండలంలోని విహాంగ్ శిక్షన్ కేంద్రంలో, ప్రత్యేకించి వికలాంగులైన పిల్లల కోసం వివిధ ఆడియాలజీ-స్పీచ్ థెరపీ, ఫిజియో థెరపీ, మ్యూజిక్ థెరపీ, పేరెంట్స్ ట్రైనింగ్ కోర్సు మొదలైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.