నావికాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధనౌక ‘‘ఆండ్రోత్’’

శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధనౌక అండ్రోత్ నౌకాదళంలోకి వచ్చేసింది. కలకత్తాలోని ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (GRSE) దీనిని రూపొందించింది. ఈ సంస్థ రూపొందించిన రెండో యుద్ధనౌక ఇది. మొదటిది ఐఎన్ఎస్ అర్నాలా. జూన్ 18 న లాంఛనంగా నౌకాదళంలోకి వచ్చేసింది.

అయితే.. ఇప్పటి అండ్రోత్ యుద్ధ నౌక లక్షదీవుల్లోని అండ్రోత్ అనే దీవి పేరును పెట్టారు. ఇందులో 30 MM సర్ఫేస్ గన్ వుంది. లోతు తక్కువగా వున్న జలాల్లోని జలాంతర్గాములను వేటాడే 16 అధునాతన నౌకలను నేవీ ఆర్డర్ చేసింది. తీర ప్రాంతానికి చేరువలోని జలాలపై నిఘా వేసే సామర్థ్యం వీటికి వుంది.

స్వదేశీ టెక్నాలజీతోనే….

అండ్రోత్ యుద్ధ నౌక పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో నిర్మించారు. సముద్ర ఉపరితలంతో పాటు లోపలి నుంచి కూడా శత్రుదేశాల దాడులను ఎదుర్కొనే లక్ష్యంతో మొత్తం 16 యుద్ధ నౌకలను 12,622 కోట్లతో తయారవుతున్నాయి. కొచ్చిన షిప్ యార్డులో నిర్మితమైన ఈ అర్నాలాతో పాటు మరో 15 యాంటీ సబ్ మెరైన్లు వివిధ దశలలో వున్నాయి.

16 షాలో వాటర్ క్రాఫ్ట్స్ ఇవే…

మొత్తం 16 యుద్ధ నౌకల్లో ఎనిమిది అర్నాలా తరగతి శ్రేణికి చెందినవి కాగా, మరో 8 మహే తరగతి శ్రేణికి చెందినవి. అర్నాలా, అంజదిప్, అమిని, అభయ్, ఆగ్రే, ఆందోథ్, అక్షయ్… ఇవి అర్నాలా శ్రేణికి చెందినవి. మహే, మాల్వాన్, మ్యాంగ్రోల్, మాల్పే, ముల్కి, మగ్దాలా, మహే తరగతి శ్రేణికి చెందిన యుద్ధ నౌకలు.

అర్నాలా విశేషాలు…

77.6 మీటర్ల పొడవున్న ఈ స్వదేశీ నౌక 1,490 టన్నుల బరువుంది. డీజిల్ ఇంజిన్ వాటర్ జెట్ తో కూడిన ప్రొపల్షన్ వల్ల ఇది 25 నాట్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. దీని ఇంధన సామర్థ్యం 1800 నాటికల్ మైళ్లు. ఒక ఆర్ బీయూ 6000 రాకెట్, రెండు తక్కువ బరువు కలిగిన అత్యాధునిక టార్పెడోలను ప్రయోగించే లాంచర్స్ ను దీనికి ఏర్పాటు చేశారు.

శత్రు జలాంతర్గాములను గుర్తించి, వాటిని అడ్డుకునేందుకు అత్యాధునిక హల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థ వుంటుంది. ఇది కూడా మన టెక్నాలజీయే.

ప్రధానంగా ఉపరితలం నుంచి శత్రు దేశాల దాడిని ఎదుర్కొనేందుకు వీలుగా దీనికి ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానించారు. 30 ఎంఎం నేవల్ సర్ఫేస్ గన్ ను ఉపయోగించేందుకు అనువుగా తయారు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *