భారత్ లో తయారైన అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ యుద్ధనౌక ‘‘హిమగిరి’’

అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ యుద్ధనౌక ‘‘హిమగిరి’’ భారత నౌకాదళంలోకి చేరింది. కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ సంస్థ దీనిని రూపొందించింది. ప్రాజెక్ట్ 17ఏ కింద ఈ సంస్థ నిర్మించే మూడు యుద్ధ నౌకల్లో ఇది మొదటిది. దీని విలువ 21,833.36 కోట్లు అని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు హిమగిరి యుద్ధనౌక పొడవు 149 మీటర్లు, బరువు 6,670 టన్నులు. వీటిలో నౌకలను ధ్వంసం చేయగలిగే బ్రహ్మోస్‌, ల్యాండ్‌ అటాక్‌ క్రూయిజ్‌ మిసైల్స్‌, బారక్‌ 8 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిసైల్స్‌ ఉంటాయి. నావికా దళ దాడులు, రక్షణ సామర్థ్యాలలో ఇది గొప్ప ముందడుగు అని ఓ ప్రకటనలో ఈ అధికారి వివరించారు.

భారత్ తన సముద్ర శక్తిని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో ఓ పెద్ద ముందడుగు వేసింది.అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ యుద్ధనౌక ‘‘హిమగిరి’’ భారత నౌకాదళంలోకి చేరింది. కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ సంస్థ దీనిని రూపొందించింది. ప్రాజెక్ట్ 17ఏ కింద ఈ సంస్థ నిర్మించే మూడు యుద్ధ నౌకల్లో ఇది మొదటిది. దీని విలువ 21,833.36 కోట్లు అని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు హిమగిరి యుద్ధనౌక పొడవు 149 మీటర్లు, బరువు 6,670 టన్నులు.

ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో, భారత్ లోనే తయారైన స్టెల్త్. గతంలో ‘‘ఉదయగిరి’’ పేరుతో ఓ నౌక కూడా చేరింది. ఈ రెండు నౌకలూ దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తాయి. ప్రాజెక్టు 17 A కింద మొత్తం 7 యుద్ధ నౌకలను నిర్మిస్తున్నారు.వీటిలో నాలుగు ముంబైలో మరియు మూడు కోల్‌కతాలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ. 45 వేల కోట్లు.జనవరి ప్రారంభంలో, ఈ ప్రాజెక్ట్ కింద ‘INS నీలగిరి’ని నావికాదళంలోకి చేర్చారు. మిగిలిన నాలుగు యుద్ధనౌకలను 2026 చివరి నాటికి నావికాదళానికి అప్పగించనున్నారు.

ఈ యుద్ధ నౌకలు ఆధునిక సాంకేతికత, ఆధునిక ఆయుధాలు కలిగి వుండడమే కాకుండా పూర్తిగా భారత్ లో తయారవుతున్నాయి. దీని ద్వారా భారత్ రక్షణ సామర్థ్యాలు పెరుగుతాయి. వీటి వల్ల భారత దేశ సముద్ర భద్రత మరింత బలోపేతం అవుతుంది. ఈ యుద్ధనౌకల సహాయంతో, భారత నావికాదళం సముద్రంలో తన ఉనికిని పెంచుకోగలుగుతుంది మరియు దేశ సముద్ర సరిహద్దులను మెరుగైన రీతిలో రక్షించుకోగలుగుతుంది.

ప్రాజెక్టు 17 A కింద తయారువుతున్న ఈ నౌకలు ప్రత్యేకంగా స్టెల్త్ టెక్నాలజీతో అమర్చబడి వుంటాయి. దీని కారణంగా శత్రువుల రాడార్లకు ఎక్కువగా కనిపించకుండా, దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి వుంటాయి. ఈ యుద్ధ నౌకలు సముద్రంలో వేగంగా యుద్ధాలు చేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *