మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఏడు దశాబ్దాల తర్వాత కరెంట్ సరఫరా

అత్యధికంగా నగ్జలైట్ ప్రభావిత ప్రాంతానికి ఎట్టకేలకు విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఛత్తీస్ గఢ్ లోని ఓ మారుమూల గ్రామానికి విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. అత్యంత మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన బీజాపూర్ లోని మారుమూల గ్రామమైన టైంనార్ లోని ప్రజలు చీకట్లోనే వుంటున్నారు. విద్యుత్ సరఫరా అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలో నూతన శకానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి విష్ణుదేవ సాయి అన్నారు.

ఆ గ్రామంలో మొత్తం 53 ఇళ్లున్నాయని, వాటన్నింటికీ విద్యుత్ సరఫరా ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ‘‘ముఖ్యమంత్రి మంజ్రా తోలా విద్యుదీకరణ పథకం’’ కింద విద్యుదీకరణ ప్రారంభమైందన్నారు. ఈ అద్భుతమైన విజయం మావోయిస్టు ఉగ్రవాదం అంతం కావడం ప్రారంభమైందని, ఆ ప్రాంతం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని అధికారులు ప్రకటించారు.

మరోవైపు గ్రామస్థులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. కరెంటును తాము చూస్తామనే అనుకోలేదని, కానీ.. ప్రభుత్వ నిష్ఠతో తమకు విద్యుత్ సరఫరా వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా తమలో అభద్రతా భావాన్ని పూర్తిగా తొలగించిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *