కీలక నక్సలైట్ రామ్‌ధేర్ రాజ్ తో సహా 12 మంది లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి  మరొక ఎదురు దెబ్బ తగిలిందిమావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్‌ధేర్ రాజ్‌ పోలీసులకు  లొంగిపోయారురామ్‌ధేర్‌తో పాటు మరో 12మంది సాయుధ నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు లొంగిపోయారురామ్‌ధేర్ ఎంఎంసీ జోన్‌‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయనపై 3 కోట్ల రివార్డ్ ఉంది. రామ్‌ధేర్ కీలక నక్సలైట్ దాడుల్లో పాల్గొన్నారు. రామ్‌ధేర్ రాజ్‌ ఛత్తీస్‌గఢ్‌లోని నందగావ్‌లోని సీఎం విష్ణుదేవ్ సాయి ముందు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు.

ఆయన దీర్ఘకాలంగా ఆయన ఎంఎంసీ జోన్‌లో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు. మిళింద్‌ తెల్టుంబే మరణం తర్వాత రాంధెర్‌ ఈ ప్రాంత నిర్వహణ, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టారు. అలాంటి నేత లొంగిపోవడం భద్రతా వ్యవస్థకు కీలక విజయంగా అధికారులు భావిస్తున్నారు. రాంధెర్‌ లొంగిపోవడంతో ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు నక్సల్స్‌ ప్రభావం నుండి దాదాపు పూర్తిగా బయటపడుతున్నాయని సమాచారం. నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, అనేక మంది ఇతర కార్యకర్తలు కూడా లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుని నేతృత్వంలోని ఈ సీనియర్ వ్యక్తులు లొంగిపోవడం నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) ఎంఎంసి యూనిట్‌కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. 12 మందిలో ఆరుగురు మహిళలు.

మావోయిస్టులు ఏకే-47 రైఫిల్, ఇన్సాస్ అస్సాల్ట్ రైఫిల్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్), 303 రైఫిల్, ఇతర ఆయుధాలను అందజేశారు. వారి పునరావాసం, సమాజంలో తిరిగి కలిసిపోవడానికి ఇప్పుడు అధికారిక చట్టపరమైన విధానాలు అనుసరిస్తారు. డిసెంబర్ 2023లో ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, రాష్ట్రంలో సుమారు 2,300 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *