బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ గా డాక్టర్ జైతీర్థ జోషి
బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ గా డీఆర్ డీఎల్ శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ జోషి బాధ్యతలు స్వీకరించారు. భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ని ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ లో కూడా వుంది. ఇక్కడ శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో విశేషంగా కృషి చేశారు. గగనతల క్షిపణుల అభివృద్ధి, పరిశోధనలకు ప్రోగ్రాం డైరెక్టర్ గా నాయకత్వం వహించారు. అతుల్ దినకర్ రాణే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ గా జోషి బాధ్యతలు చేపట్టారు.