కల్తీ విత్తనాలను అరికట్టడానికి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కొత్త చట్టం : శివరాజ్ సింగ్

నాణ్యత లేని, కల్తీ విత్తనాల అమ్మకాలను అరికట్టడానికి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పక్రకటించారు. ముంబైలో జరిగిన ఆసియా విత్తన కాంగ్రెస్ 2025 ప్రారంభోత్సవంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగించారు. ఉద్యానవన పంటలకు నాణ్యమైన నాటే సామాగ్రి కోసం మహారాష్ట్రలో క్లీన్ ప్లాంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

వాతావరణాన్ని తట్టుకునే విత్తన రకాలను, సరసమైన ధరలకు వచ్చే విత్తనాలతో పాటు నాణ్యగత గల విత్తనాలపై దృష్టి సారించాలని, పప్పుధాన్యాలు మరియు నూనెగింజల ఉత్పత్తిలో భాగస్వామ్యాన్ని పెంచాలని రైతులకు పిలుపునిచ్చారు. విత్తన కంపెనీలకు 100 శాతం రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసే జాతీయ “సథి” (సీడ్ అథెంటికేషన్, ట్రేసబిలిటీ మరియు హోలిస్టిక్ ఇన్వెంటరీ) పోర్టల్‌ని కూడా ఫాలో అవ్వాలని సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *