నిమ్మకాయ (నిమ్మ ఆకు)

ఇది ప్రతి ఇంటిముందు, లేక తోటలో ఉండే మొక్క. దీనికి పరిచయం అక్కరలేదు. అలా అని పట్టించుకోకపోయినా మన ఆరోగ్యానికి ఎంతో నష్టం.

–           నిమ్మ ఆకుల రసం, లేక నిమ్మ ఆకులు వేసి తోడు పెట్టిన మజ్జిగ చాలా చలవ చేస్తుంది

–           నిమ్మకాయలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. దానివల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. తత్ఫలితంగా ఎన్నో క్రిమికీటాదులు మన శరీరాన్ని బాధించకుండా ఉంటుంది

–           నిమ్మకాయ రసం, నీళ్ళు, ఉప్పు, పంచదార కలిపిన పానీయం త్రాగితే ఒక సెలైన్‌ సీసా పుచ్చుకున్నంత బలం వస్తుంది.

–          నిమ్మకాయలో కెరోటిన్‌ అన్న రసాయనం వల్ల రక్తశుద్ధి కలిగి శరీరానికి మంచి కాంతి వస్తుంది.

–         ఎండపెట్టిన నిమ్మకాయపొడి ముఖ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ విధంగా నిమ్మకాయ చేసే మేలు అంతా-ఇంతా కాదు. కాబట్టి అందరూ నిమ్మకాయలను వృధా చేసుకోకుండా రోజూ వాడడం వలన ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *