కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంపు : బడ్జెట్ లో రైతులకు ప్రయోజనాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 సంవత్సరానికి గాను బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. వికసిత భారత్ లక్ష్యంగా కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో 70 శాతం మహిళలకే ప్రాధాన్యమని తెలిపారు. అలాగే వ్యవసాయంతో పాటు 10 రంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. బిహార్ ల మఖానా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. కేసీసీ ద్వారా ఇచ్చే లోన్లు 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అలాగే బిహార్ లోని మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు… మఖానా ఉత్పత్తి పెంచేలా బోర్డు ద్వారా శిక్షణ ఇస్తామని తెలిపారు.
100 జిల్లాలను ధనధాన్య యోజనతో అనుసంధానించనున్నారు. పంట వైవిధ్యీకరణ, నీటిపారుదల సౌకర్యాలు, రుణాలు 1.7 కోట్ల మంది రైతులకు సహాయపడతాయన్నారు. పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించే ప్రణాళికలలో కందులు, పెసలు, మినుములపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని ప్రకటించారు. ధనధాన్య పథకం కింద నాఫెడ్, ఎన్ సీసీఎఫ్ రైతుల నుంచి పప్పు ధాన్యాలను కొనుగోలు చేస్తాయన్నారు. అలాగే మత్స్యకారులకు ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రటకించారు. పత్తి ఉత్పాదకత పెంచేందుకు స్పెషల్ మిషన్ చేపడతాన్నారు.