చైనాకి సంబంధించిన భాగాలను వినియోగించం : భారత సైన్యం

దేశానికి సంబంధించిన ఏ సైనిక ఆయుధాలకు సంబంధించిన విభాగాల్లో చైనాకి సంబంధించిన భాగాలను వినియోగించమని భారత ఆర్మీ డిజైన్ బ్యూరో ఏడీజీ మేజర్ జనరల్ సీఎస్ మాన్ తేల్చి చెప్పారు. భారతీయ డ్రోన్లలో చైనాకి సంబంధించిన భాగాలను ఉపయోగిస్తున్నట్లు వస్తున్న పుకార్లపై స్పందించారు. దీనికి సంబంధించిన ఓ ఫ్రేమ్ వర్క్ ను రూపొందిస్తున్నామని గత యేడాదే పేర్కొన్నామని, ఇప్పుడు ఆ ఫ్రేమ్ వర్క్ పూర్తైందని, ఆమోదానికి రెడీగా వుందని పేర్కొన్నారు.దీని తర్వాత ఆయుధాలకు సమగ్ర పరీక్షలు జరుగుతాయని తెలిపారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కి చైనా మొత్తం సహాయ అందిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *