రైతులకు సేవ చేయడం కంటే గొప్ప పూజ మరొకటి లేదు : శివరాజ్ సింగ్

దేశానికి అన్నంపెట్టే అన్నదాతలకు సేవ చేయడం కంటే గొప్ప పూజ మరొకటి లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆహారాన్ని హిందూ ధర్మంలో బ్రహ్మ స్వరూపంతో పోలుస్తారని, ఆహారం మనిషికి జీవనాడి అని, అందుకే వారు జీవనాధారం కల్పించేవారని వర్ణించారు. పూసా ఇనిస్టిట్యూట్ లో రైతులతో సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ

‘‘ఈహారం మన జీవితం. ఆహారం పరబ్రహ్మ స్వరూపం. రైతు అన్నం పెడతాడు. అందుకే ఆహారాన్ని, జీవితాన్నిచ్చేవాడు రైతే. వ్యవసాయ మంత్రిగా రైతులకు సేవ చేయడం దేవుడ్ని ఆరాధించినట్లే భావిస్తా. దీనికంటే గొప్ప ఆరాధన వేరొకటి లేదు. నేను కిసాన్ సేవక్ గా వుండడానికే ప్రయత్నిస్తా. నా ప్రతి కణంలో రైతులే వున్నారు’’ అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రైతులపై వున్న నిబద్ధతను చెప్పుకొచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల ప్రయోజనాలతో ఎప్పుడూ రాజీపడరని చౌహాన్ అన్నారు. “ఇది భారతదేశం యొక్క స్వరం, ఇది భారతదేశం యొక్క రైతుల స్వరం” అని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *